ప్రతిపక్షానికి ఉన్న 23 మంది ఎం ఎల్ ఏ లలో 5 మందిని వై ఎస్ ఆర్ సి పీ లోనికి లాగేద్దామని చాలామంది సూచించినట్టు  జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో  వెల్లడించారు. ఆ విదంగా చేసినట్టయితే  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష హోదా కోల్పోతారని  చెప్పారు. అందుకు అంగీకరిస్తే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షము ఉండదని వారిని వారించినట్టు, అంతే కాకుండా అలాచేస్తే ఆయనకు తనకు తేడా ఏముందని జగన్  వెల్లడించారు. 


గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన 67 మంది ఎం ఎల్ ఏ లలో 23 మంది ఎమ్మెల్యేలను ఫిరాయించేలా ప్రొత్సహించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శాసన సభలో ఈ మాట చెప్పేసరికి చంద్ర బాబు నాయుడు గుర్రున చూడడం సభలో నవ్వులపాలయ్యారు. 


40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్ర బాబు నాయుడు సభలో అల్లరిపాలవుతున్న తీరు చాలా దయనీయంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు లాగే జగన్  చేస్తే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఒక్కసారిగా మూతపడే పరిస్థితేనని చెబుతున్నారు. అధికారంలో ఉండగా ప్రతిపక్షములో ఉన్న జగన్పై అనేక నిందారోపణులు చేసిన చంద్రబాబు నాయుడు మారు మాట్లాడకుండా సభలో ప్రేక్షక పాత్ర వహించడం టి డి పీ ఎం ఎల్ ఏ లు జీర్ణించుకోలేకపోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: