ప్రభుత్వంలో జరుగుతున్న తాజా పరిణామాలతో  రోజా కీరిక తీరిందా ? తాజా పరిణామాల నేపధ్యంలో రోజాకు జగన్ క్యాబినెట్ ర్యాంకున్న నామినేటెడ్ పోస్టు ఇచ్చారు. ఇపుడిదే ప్రశ్న వైసిపి నేతల్లో జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో వైసిపి అఖండ విజయం సాధించినప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో రోజాకు స్ధానం ఖాయమనే ప్రచారం ఏ స్ధాయిలో జరిగిందో తెలిసిందే. అయితే అనూహ్యంగా రోజాకు భంగపాటు తప్పలేదు.

 

క్యాబినెట్లో బెర్తు కోసం ఎదురు చూస్తున్న రోజాకు జగన్ అవకాశం ఇవ్వలేదు. దాంతో రోజానే కాదు వైసిపి శ్రేణులు, జనాలు కూడా ఆశ్చర్యపోయారు.  ఎంతైనా మంత్రి పదవి వస్తుందని ఆశించింది కాబట్టి రోజాలో బాధ ఉండటం సహజం. అదే విషయం ఆమె మీడియాతో మాట్లాడిన ప్రతీసారీ స్పష్టంగా కనబడింది.

 

రోజాలో ఉన్న అసంతృప్తిని జగన్ గ్రహించకుండా ఉంటారా ? అందుకే పిలిపించి మాట్లాడారు. ఏపిఐఐసి ఛైర్ పర్సన్ గా నియమిస్తున్నట్లు చెప్పారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చలో ఏం జరిగిందో తెలీదు కానీ మొత్తానికి రోజా ఛైర్ పర్సన్ గా ఉండటానికి అంగీకరించారు. అందుకే తనను ఏపిఐఐసి ఛైర్ పర్సన్ గా నియమించినందుకు జగన్ కు ధన్యవాదాలు తెలుపుతూ రోజా ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. మంత్రి పదవి రాకపోయినా క్యాబినెట్ ర్యాంకున్న పోస్టు దక్కటంతో రోజా కోరిక తీరిపోయినట్లేనా అని పార్టీలో చర్చ ఊపందుకుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: