త్వరలో నర్సరావుపేట, సత్తెనపల్లిలో మరో భారి కుంభకోణాన్ని బయటపెడతాం--మంత్రి మేకపాటి గౌతంరెడ్డి

 

సైలేజ్ గడ్డి కుంభకోణంలో సుమారు 45 కోట్లు డ్రా చేసేందుకు రైతుల పేర్లతో తప్పుడు ఎకౌంట్లు సృష్టించిన ఘనమైన పుత్రరత్నాలు కోడెల కి ఉన్నారు.

 

రెండు నియోజకవర్గాల్లో RWS వాటర్ స్కీమ్ వర్కులలో భారి అవినీతి జరిగింది. కోడెల శివరాం బినామి వ్యక్తి ఎకౌంట్లలోకి ఎంత డబ్బు వచ్చిందో సీబిసిఐడి వారు పక్కా ఆధారలతో  తేలుస్తారు. ఒకే కాంట్రాక్టర్ ,కోడెల బినామీ గా రెండు నియోజకవర్గాల్లో పేద ప్రజల త్రాగునీటి స్కీమ్ లో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు.దీనిలో సహకరించిన అధికారులను బెదిరించి రికార్డులు తారుమారు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు.అధికారులకు మేము అండగా ఉంటాం.

 

వారి సేఫ్ అనే నకిలీ మందుల కంపెనీ నుంచి ప్రభుత్వానికి నాసిరకం మందులు సరఫరా చేసి కోట్లు దండుకున్నారు. ప్రభుత్వం మారగానే అవి నాసి రకం అని తెలియడంతో బిల్లులు నిలుపుదల చేశారు.

 

అసెంబ్లీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరు తో పేదలకి ఆశ చూపించి డబ్బలు వసూలు చేసిన ఘననీయమైన చరిత్ర కోడెల కుటుంబానిది.

 

సొంత కోడలు ని కూడా వేదింపులకు గురి చేసి కిడ్నాప్ కి పాల్పడిన చరిత్ర మీది.

 

ఇలాంటి వ్యక్తిని స్పీకర్ గా చేయడానికి చంద్రబాబుకి ఆలోచనలు ఎలా వచ్చాయో అర్దం కావడం లేదు.

 

సిఎం జగన్ గారిపైన విజయసాయిరెడ్డి పైన మీ వ్యాక్యలు మానుకోకపోతే మీకు తగిన శాస్తి జరుగుతుంది.

 

బాదితులు నిర్బయంగా బయటకు వచ్చి ఫిర్యాదు చేయండి.

 

త్వరలో అసెంబ్లీ, క్యాబినెట్ లో చర్చించి కోడెల కుటుంబ బాదితులకు న్యాయం చేసేందుకు సిట్ లేదా జ్యుడీషియల్  ఎంక్వరీ వేస్తాం..

మరింత సమాచారం తెలుసుకోండి: