ఏపీలో భారీ విజయాన్ని నమోదు చేసి సీఎం పీఠం ఎక్కిన జగన్ పాలనను జెట్ స్పీడ్ లో నడిపిస్తున్నారు.  అలాగే జగన్ నిధుల అడిగిన వెంటనే కేంద్రం సానుకూలకంగా స్పందించి నిధులు విడుదల చేయటం రాష్ట్రానికి శుభ పరిణామంగా చెప్పుకోవాలి. రాష్ట్ర విభజన సందర్భంగా పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చేసిన కేంద్రం... ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును భరిస్తానని ప్రకటించింది.


అంతేకాకుండా తామే ప్రాజెక్టును నిర్మించి ఇస్తామని కూడా చెప్పింది. అయితే చంద్రబాబు సర్కారు మాత్రం నిధులిస్తే తామే ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడతామని కొత్త ప్రతిపాదన చేసి ప్రాజెక్టు పనులను తమకు అనుకూలమైన వారికి కట్టబెట్టింది. అయితే ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగించే క్రమంలో చంద్రబాబు సర్కారు... రాష్ట్ర ఖజానా నుంచి రూ.5 వేల కోట్లను వెచ్చించింది. ఈ నిధులను విడుదల చేయాలంటూ చంద్రబాబు సర్కారు ఎన్ని సార్లు విన్నవించినా మోదీ పట్టించుకోలేదు.


అయితే తాను సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత... ఈ నిధులను రాబట్టే విషయంలో జగన్ చాలా వేగంగానే స్పందించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేసిన రూ.5 వేల కోట్లను తక్షణమే విడుదల చేయాలంటూ జగన్ సర్కారు కేంద్రానికి లేఖ రాసింది. ఈ లేఖను అందుకున్న కేంద్ర జలవనరుల శాఖ కూడా సానుకూలంగానే స్పందిస్తూ ఆ నిధుల విడుదలకు అనుమతించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపింది. కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాగానే... ఈ నిధులు రాష్ట్రానికి విడుదల కానున్నాయి. అంటే... పోలవరం కోసం చంద్రబాబు సర్కారు ఖర్చు చేసిన రూ.5 వేల కోట్లను జగన్ అధికారం చేపట్టిన వెంటనే కేంద్రం నుంచి రాబడుతున్నారన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: