పార్టీలో జరుగుతున్నది చూస్తుంటే రాపాక వరప్రసాద్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు షాకిచ్చేట్లు ఉన్నారు. ఎందుకంటే పార్టీ తరపున గెలిచిన ఒక్క ఎంఎల్ఏను కూడా జనసేన కాపాడుకునేట్లు లేదు. మొన్నటి ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున గెలిచిందే తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో గెలిచారు రాపాక వరప్రసాద్.

 

అసెంబ్లీలో జగన్ ను మర్యాద పూర్వకంగా రాపాక కలిశారు. మంత్రివర్గం కూర్పులో జగన్ అనుసరించిన సామాజిక ప్రాధాన్యతలు బాగున్నాయంటూ పొగిడారు. అంతే ముఖ్యమంత్రిని రాపాక పొగడటాన్ని జనసేన శ్రేణులు జీర్ణించుకోలేకున్నారు. ప్రతిపక్ష సభ్యుడు అయ్యుండి కూడా సిఎంను ప్రశంసించటమేమిటంటూ జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో రాపాకపై దుమ్మెత్తి పోస్తున్నారు.

 

తనపై సొంత పార్టీలోనే ట్రోలింగ్ చేయటాన్ని చూసిన రాపాక స్టన్ అయిపోయారు. రాపాకపై ట్రోలింగ్ తో ఆపితే ఏదోలే అని సరిపెట్టుకోవచ్చు. కానీ జనసేనలో ఉంటే ఉండు లేకపోతే వైసిపిలోకి వెళ్ళిపో అంటూ అల్టిమేటమ్ కూడా ఇవ్వటం పెద్ద చర్చనీయాంశమైంది.  తన పార్టీ సోషల్ మీడియాలో ఎంఎల్ఏ పై ఇంత రచ్చ జరుగుతున్నా పవన్ కానీ ముఖ్యులు కానీ ఎవ్వరూ స్పందిచకపోవటమే విచిత్రంగా ఉంది.

 

నిజానికి రాపాక వైసిపిలోనే ఉండేవారు. కానీ రాజోలులో టికెట్ రాదని తెలుసుకున్న తర్వాతే జనసేనలోకి జంప్ చేశారు. రాజోలులో ఎంఎల్ఏ  గెలిచింది కూడా జనసేన బలం వల్ల కాదు. రాపాక ఇది వరకే పిఆర్పి తరపున ఎంఎల్ఏగా చేశారు. కాబట్టి నియోజకవర్గంలో బలమైన మద్దతుదారులున్నారు.  ఎలక్షనీరింగ్ తో పాటు కాపు ఓట్లు కూడా జనసేనకు పడటంతో రాపాక గెలిచారు.

 

మొత్తం మీద జనసేనలో జరుగుతున్నది చూస్తుంటే రాపాక పార్టీని వదిలి  బయటకు వెళ్ళిపోయేంత వరకూ పార్టీ నేతలు, శ్రేణులకు నిద్రపట్టేట్లు లేదు. రాపాకను బయటకు తరిమేసేట్లుగా అప్పుడే పొగ పెట్టటం షురూ అయినట్లుంది చూస్తుంటే. మొన్నటి ఎన్నికల్లో జనసేనకు జరిగిన అవమానాన్ని పక్కన పెట్టినా గెలిచిన ఒక్క ఎంఎల్ఏను కూడా పవన్ నిలుపుకోలేక  పోతుండటమే విచిత్రంగా ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: