నీటి దౌత్యంలో భాగంగా...తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం మహారాష్ట్రకు వెళ్లనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆహ్వానించడానికి ఉదయం 10.20 గంటలకు హైదరాబాద్ నుంచి ముంబై రాజ్‌భవన్‌కు బయలుదేరారు. మధ్యాహ్నం 2 గంటలకు మహారాష్ట్ర సీఎం అధికార నివాసమైన వర్షకు వెళ్తారు. ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని ఫడ్నవీస్‌ను సీఎం కేసీఆర్ స్వయంగా ఆహ్వానిస్తారు.


ఉత్తర తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరింది. ఈ నెల 21న ఉద యం 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పంపుల స్విచ్ ఆన్ చేసి, ప్రాజెక్టును ముఖ్యమంత్రి కెసిఆర్ లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే ఈ ప్రాజెక్టు ప్రారంభానికి మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని ముఖ్య అతిధిగా ఆహ్వానించాలని కెసిఆర్ నిర్ణయించారు. ఇందుకోసం త్వరలోనే విజయవాడకు ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి సిఎం జగన్‌ను ఆహ్వానించనున్నా రు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్‌తో కూడా సిఎం కెసిఆర్ ఫోన్‌లో మాట్లాడారు. కాళేశ్వరం ప్రారంభానికి ఆయనను ఆహ్వానించగా, సానుకూలంగా స్పందించారు. ప్రాజెక్టు ప్రారంభానికి రావడానికి ఒప్పుకున్నారు. 


ముచ్చటగా ముగ్గురు ముఖ్యమంత్రుల సమక్షంలో ప్రాజెక్టు ప్రారంభమైతే అంతర్రాష్ట్ర సంబంధాల్లో ఇదో మైలురాయిగా మిగిలిపోతుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు రాష్ట్రంలో 70 శాతం భూభాగానికి సాగు, తాగు నీటితో పాటు పరిశ్రమలకు సైతం నీరందించేలా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దేశ నీటిపారుదల రంగంలోనే సరికొత్త రికార్డు సృష్టిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే నెల నుంచే నీటి పంపింగ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.మానవ నిర్మిత అద్భుతంగా మానవ నిర్మిత అద్భుతంగా నిలుస్తుందని సి.డబ్ల్యు. సి. అధికారుల నుంచి మొదలుకుని వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, నీటి పారుదల నిపుణులు కితాబిచ్చిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే శరవేగంగా నిర్మితమైన భారీ ఎత్తిపోతల పథకం. మేడిగడ్డ వద్ద సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో గోదావరి నీళ్లను ఆరు దశల్లో లిఫ్టు చేసి 618 మీటర్ల ఎత్తులో ఉండే కొండపోచమ్మ సాగర్ వరకు తరలిస్తారు. అంటే గోదావరి నది నీళ్లను అరకిలోమీటరుకు పైగా ఎత్తుకు లిఫ్టు చేస్తారు. ఈ ఏడాది ప్రతీ రోజు రెండు టి.ఎం.సి.లను ఎత్తిపోయడానికి అనువుగా పంపుహౌజులు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రతీ రోజు మూడు టిఎంసిల చొప్పున ఎత్తిపోయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: