తమ్ముళ్ళు అంటే అణిగిమణిగి ఉంటారు. అన్నయ్య తీరు బాగుంటే. కానీ అదే అన్నయ్య్య లాంటి అధినేత ఇపుడు విపత్కరపరిస్థితిలో ఉన్నారు. పార్టీ ఎన్నడూ లేని విధంగా దారుణంగా ఓటమిపాలు అయింది. ఓటమి సహజం కానీ తెలుగుదేశం ఇపుడు సంక్షోభం వైపుగా సాగుతోంది. 


ఆ బెంగతోనే తమ్ముళ్లు అధినేత చంద్రబాబు ముందు కుండబద్దలు కొట్టారు. అదీ కూడా తాపీగా అంతా అయిపోయాక, గుండు సున్నాగా మిగిలాక‌ తీరిగ్గా నిజాలన్నీ చెబుతున్నారు. బాబు అధికారులను నమ్మారని, కార్యకర్తలను పట్టించుకోలేదని తమ్ముళ్ళు వాపోయారు. 


అప్పట్లో 2004లో  ఏలా ఓడారో ఇపుడూ అవే కారణాల వల్ల ఓటమి మూటకట్టుకున్నారని గుట్టు విప్పేశారు. పార్టీకి, నాయకులకు మధ్య దూరం పెరిగిందని అంతా చెబుతూంటే అదా అసలు కధ అని షాక్ తినడం బాబు వంతు అయింది. మొత్తానికి మభ్యపెట్టింది ఎవరు, భ్రమల్లో ఉన్నదెవరు అన్నది మెల్లగా పసుపు పార్టీ నేతలకు తెలిసివచ్చిందిగా.


మరింత సమాచారం తెలుసుకోండి: