ఇపుడు గేమ్  వైసీపీది. టీడీపీ అయిదేళ్ల పాటు పెట్టిన నరకం. చిత్రహింసలు అన్నీ భరించిన తరువాతనే వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపధ్యంలో ఇంతకు ఇంత అప్పు తీర్చుకోవాలిగా. ఇపుడు అదే జరుగుతోందేమో. ఈ ఆట చాలా రసవత్తరంగా ఉంది. నిన్నటికి ఇది అచ్చమైన రివేంజ్


మేము కనుక గేట్లు తెరిస్తే ఒక్క చంద్రబాబు తప్ప ఎవరూ పార్టీలో మిగలరు. ఇది నిండు అసెంబ్లీ సాక్షిగా  ముఖ్యమంత్రి  హోదాలో జగన్ ఇచ్చిన పక్కా స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ చాలు అక్కడే సభలో ఉన్న చంద్రబాబు బేజారెత్తిపోవడానికి. నిజానికి  చంద్రబాబుకు తెలియని విషయం కాదు గెలుపు ఎక్కడ ఉంటే నాయకుడు ఉంటారని. అయినా తనతోనే పార్టీ మొత్తం ఉంటుందని బాబు ధైర్యం చెప్పుకుంటున్నారు. తప్పదు మరి. 


ఇక వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే కోటం రెడ్డి  శ్రీధర్ రెడ్డి తాజాగా మరో బాంబు  పేల్చారు. తమ వద్ద టీడీపీ ఎమ్మెల్యేల లిస్ట్ ఉందని, కనీసంగా 8 మంది నుంచి పది మంది వరకూ తమ్ముళ్ళు తమ పార్టీలోకి వచ్చేందుకు చూస్తున్నారని. ఇది చాలదా బాబు గారు తల్లడిల్లిపోవడానికి.ఎవరు ఆ ఎమ్మెల్యేలు ఇపుడు బాబు గారు అందరినీ అనుమానంగానే చూస్తారు కదా. 


ఇంకొక విషయం ఏంటంటే ఓ సీనియర్ రాజ్యసభ సభ్యుడు కూడా గత రెండు నెలలుగా వైసీపీతో టచ్ లో ఉన్నారట. ఆయనెవరో మరి. జగన్ సరేనంటే ఆయన ఫ్యాన్ నీడకు తయారు అంటున్నారు కోటం రెడ్డి. ఇలా బాబు గారు గుండెలు పిండే నిజాలు చెప్పేస్తూ ఉంటే ఆయనకు నిద్ర పడుతుందా. అసలు ఆయనకు మనశ్శాంతి ఉంటుందా. ఓ విధంగా టీడీపీ ఇపుడు పెను సంక్షోభంలో ఉంది. దాన్ని ఎదుర్కొని బయటకు రావడం ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీకి పెను సవాలే.


మరింత సమాచారం తెలుసుకోండి: