సచివాలయంలో ఉన్న భవనాలను ఖాళీ చేసి ఇచ్చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఓకే అనడంతో, తెలంగాణ సచివాలయం కోసం కొత్త భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది.ఈ నెల 26న భూమి పూజకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 ఓకే అంతా బాగుంది కానీ, అసలు కథ ఇపుడు మొదలు కాబోతుంది.

  ఆఫీసుల తరలింపు అంత ఈజీ కాదు సచివాలయాన్ని పడగొట్టే ముందు చాలా తతంగం ఉంది. సచివాలయంలో డిపార్టుమెంట్లు వివిధ చోట్లకు షిఫ్ట్‌ చేయాలి. ఇపుడున్న సచివాలయంలో ఉన్న కంప్యూటర్లు, లాన్‌ తదితర ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ మళ్లీ కొత్తగా ఏర్పాటు చేసుకోవాలి. వెళ్ల బోయే భవనాల్లో కొత్త సౌకర్యాలు, కొత్త ఫర్నీచర్‌ ఏర్పాటు చేసుకోవాలి.అత్యంత కీలకమైన జిఏడి, న్యాయ శాఖ, ఫైనాన్సు శాఖలకు బూర్గుల రామకష్ణారావు భవన్‌కు తరలిస్తారంటున్నారు. దీనికి చాలా వ్యయం అవుతుంది. 

 పరిపాలన ఇబ్బందులు తప్పవు. పాలన సంగతి అలా ఉంచితే కార్యాలయాల తరలింపు కోసం పెట్టే ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. కొత్త భవనం కట్టడం అంత ఈజీ కాదు ఉన్న భవనం కూల్చడం . తెలంగాణ సెక్రటేరియట్‌లో కొన్నిన భవనాలు కొత్తవే. డి, హెచ్‌ బ్లాక్‌లు కొత్తగా కట్టినవే. సి, ఎల్‌ బ్లాక్‌లపై ఎంతో ఖర్చు చేసి ఉన్నారు. పురాతనమైన జి బ్లాక్‌ను వారసత్వ భవనంగా గుర్తించాలనే కేసు ఒకటి నడుస్తోంది. 
పురాతనమైన భవనాలు, భారీ భవనాలు కూలగొడితే తెలుగు తల్లి విగ్రహం ప్రాంతం అంతా కలుషితం అయిపోతుంది. గాలిలో దుమ్ము కణాలుదారుణంగా పెరిగిపోతాయి. అత్యంత పెద్ద భవనాలు కూలగొడితే వచ్చే శిధిలాలను ఎక్కడికి తరలించాలనేది మరో పెద్ద ప్రధాన సమస్య.

పక్కనే ఉన్నహుస్సేన్‌ సాగర్‌ ఇప్పటికే కలుషితం అయి ఉన్నది. ఈ దుమ్ముకణాలు వ్యాపిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని పర్యావరణ వేత్తలు ఆందోళన పడుతున్నారు. పటిష్టంగా ఉన్న భవనాలను పడగొట్టడం వెనుక ఇన్ని సమస్యలున్నాయి.
పడగొట్టడం మాట అటుంచి ఉన్న భవనాల నుంచి ఉన్న కార్యాలయాలను తరలించడానికే దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఒక అంచనా. 
ఇన్ని సమస్యలను అధిక మిస్తూ ప్రభుత్వం కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణం వైపు ఎలా ఆడుగులు వేస్తుందో కాలమే నిర్ణయించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: