మొన్నటి ఎన్నికల్లో ఘోరమైన ఓటమి తర్వాత చంద్రబాబునాయుడును అందరూ వదిలేస్తున్నట్లున్నారు.  మొదట తమిళనాడులో స్టాలిన్ వదిలేస్తే తాజాగా కుమారస్వామి వంతు. జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారానికి చెన్నై నుండి అదే పనిగా ఎంకె స్టాలిన్ విజయవాడకు వచ్చారు. కార్యక్రమంలో పూర్తిగా ఇన్వాల్వ్ మెంటు అయ్యారు. తర్వాత జగన్ ఇంటికి వెళ్ళి భోజనం కూడా చేశారు. విషయం ఏమిటంటే కొడుకు, సినీనటుడు ఉదయనిధి స్టాలిన్ తో సహా వచ్చారు.

 

సీన్ కట్ చేస్తే శనివారం ఉదయం ఢిల్లీ  పర్యటనలో ఉన్న జగన్ ను కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కలిశారు. ఏపి భవన్ లో ఎంపిల సమావేశంలో ఉన్న జగన్ తో కుమారస్వామి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎంతైనా ఇరుగు పొరుగు సిఎంలు కదా ? ఆమాత్రం ఇచ్చిపుచ్చుకోకపోతే ఎలాగనుకున్నారో ఏమో ?

 

విషయం ఏమిటంటే ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత చంద్రబాబు అదే పనిగా తమిళనాడు, కర్నాటకలు వెళ్ళి స్టాలిన్, కుమారస్వామిని కలిసేవారు. ఏదో ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబును వాళ్ళు కూడా ఎంటర్ టైన్ చేసేవారు. కానీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వాళ్ళకు చంద్రబాబుతో ఏం పనుంటుంది ?

 

ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళతోనే పనుంటుంది ఎవరికైనా. అందుకనే స్టాలిన్ అయినా కుమారస్వామి అయినా కనీసం చంద్రబాబు వైపు కనీసం చూడటం లేదు. ముఖ్యమంత్రి జగన్ కాబట్టి అదే పనిగా వెళ్ళి మరీ కలుస్తున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: