శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో జరిగిన నీతి అయోగ్ సమావేంలో జగన్మోహన్ రెడ్డి అదరగొట్టేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి అధ్యక్షతన జరిగిన సమావేంలో ముగ్గురు సిఎంలు తప్ప మిగిలిన వారంతా పాల్గొన్నారు. నిధుల కేటాయింపులు, అనుమతులు, పథకాల అమలు తదితరాల్లో నీతి అయోగ్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

 

అటువంటి కీలక సమావేంలో జగన్ మొదటిసారి పాల్గొన్నారు. పాల్గొన్న మొదటి సమావేంలోనే జగన్ ప్రత్యేకహోదా విషయంలో బలంగా తన వాదన వినిపించారు. విభజన హామీల చట్టంలో  ప్రత్యేకహోదా ఎంతటి కీలకమో వివరించారు. ఒకవైపు హోదా ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తునే 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో  హోదాపై  బిజెపి ఇచ్చిన హామీని మోడికి గుర్తుచేశారు.

 

గడచిన ఐదేళ్ళలో చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో అప్పులు ఏ విధంగా పెరిగిపోయింది, చంద్రబాబు చేసిన అప్పులకు ఏడాదికి కడుతున్న వేల కోట్ల రూపాయల వడ్డీల లెక్కలను వివరించారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం ఏ విధంగా ఆర్ధికంగా దెబ్బతిన్నదనే విషయాన్ని కూడా వివరించారు. అసలు విభజన సమయంలోనే ఏపికి జరిగిన అన్యాయాన్ని మరోమారు నీతిఅయోగ్ సమావేంలో వివరించారు.

 

అన్నీ విధాలుగా నష్టపోయిన ఏపి అభివృద్ధిలోకి రావాలంటే ప్రత్యేకహోదా ఇవ్వటం ఎంతటి అవసరమో ఉదాహరణలతో సహా జగన్ వివరించారు. 14వ ఆర్ధికరంగం సిఫారసులు, వ్యాఖ్యలను కూడా సమావేంలో జగన్ గుర్తుచేశారు. మొత్తం మీద ప్రత్యేకహోదా అన్నది ఏపికి ఎంతటి అవసరమో స్పష్టంగా వివరించటంలో జగన్ సక్సెస్ అయ్యారు.

 

సరే హోదా ఇవ్వటమా ? మానటమా ? అన్నది పూర్తిగా రాజకీయ నిర్ణయమని అందరికీ తెలిసిందే.  మోడి తలచుకుంటే ఏపికి ప్రత్యేకహోదా రావటాన్ని ఎవరూ అడ్డుకోలేరు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే హోదా విషయంలో జగన్ తన వాదనను చాలా సమర్ధవంతంగా సమావేశంలో వినిపించారు. మరి మోడి ఏం చేస్తారో చూడాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: