- 1 నుంచి 10 వరకూ అదే ఫీజని నిబంధన చేయండి
- విద్యార్ధులు ఎక్కడ చదివినా ఏడాదికి రూ.15000 చెల్లించండి


రాజన్న బడిబాట- అమ్మ ఒడి పథక ఆశయం హర్జించదగ్గదే.  ఎవరూ ఈ పథకాన్ని తప్పు పట్టేందుకు సాహసించలేరు. అయితే అదే సంధర్భంలో పథక ఆశయం పక్కదారి పట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయనే సందేహాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏటా ప్రతి విద్యార్ధికి రూ. 15000 ఖర్చు చేస్తామని ప్రకటించినప్పటి నుంచి విద్యార్ధులను ఆకర్షించేందుకు చోటా మోటా ప్రైవేటు పాఠశాలలు కసరత్తు చేస్తున్నాయి. ఏటా రూ.15000 ప్రభుత్వం చెల్లిస్తుందని, ప్రభుత్వ గుర్తింపు ఉందని విస్త్రుత ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. 


అరకొర వసతులతో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు సిద్దంగా లేరు. అర్హులైన ఉపాధ్యాయులు, అనుభవం ఉన్నవారు అని ఎంతగా చెబుతున్నప్పటికీ మధ్య తరగతి వర్గాలవారు తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపేందుకు సిద్దం కావటంలేదు.  ప్రభుత్వం ఇచ్చే రూ.15000 తో ప్రైవేటు పాఠశాలలోనే చదివించుకునేందుకు సిద్దమవుతున్నారు. ఇదే విధానం కొనసాగితే చిన్నా చితకా ప్రైవేటు పాఠశాలతో బాగుపడే అవకాశం ఉంది. 


అదే సంధర్భంలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకటో తరగతి విద్యార్థికి రూ.5000 తీసుకునే ప్రవేటు పాఠశాలలున్నాయి. అదే తరగతికి ఏడాదికి రూ.25,000 తీసుకునే పాఠశాలలూ ఉన్నాయి. పదవ తరగతి విద్యార్ధికి ఏడాదికి కనీసంగా రూ. 30,000 కేవలం ఫీజులకు అవుతోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ హెచ్చుతగ్గులను రూపుమాపితే ప్రభుత్వ పాఠశాలలంటే చిన్నచూపు , చులకన భావం తగ్గుతుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో సరిగా చెప్పరనే భావన ప్రతి ఒక్కరిలోనూ పాతుకుపోయింది. అర్హులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నప్పటికీ సక్రమంగా బోధించరనే సందేహాలు కూడా ఉన్నాయి. ఈ సందేహాలను తొలగించాలంటే మొదటిగా ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతులు సంవృద్దిగా సమకూర్చాలి. ఆయా ప్రత్యేకతల గురించి విస్తృత ప్రచారం నిర్వహించాలి.  అప్పుడే ప్రవేటు పాఠశాలల సంఖ్య తగ్గి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగేందుకు అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: