టీడీపీ పార్టీ ఓటమి గురించి ఎంపి మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చివర్లో డబ్బులు బాగా పంచిన ప్రజలు నమ్మలేదని, అందుకే పోయాడని చెప్పుకొచ్చారు. ఇంకా టీడీపీ ఓటమి గురించి పలు విషయాలు చెప్పుకొచ్చారు. పసుపు-కుంకుమ కింద 10వేల రూపాయలిచ్చినా చంద్రబాబును జనం నమ్మలేదని అంగీకరించారు జేసీ. పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో పాటు బాబు చేసిన తప్పిదాల వల్ల పార్టీ ఓడిపోయిందన్నారు.


మరోవైపు జగన్ వేవ్ కూడా బలంగా ఉందన్న జేసీ.. తనతో ఉండి తనతో అన్నం తిన్న వ్యక్తి కూడా వెళ్లి జగన్ కు ఓటేశారని బాధపడ్డారు. ఈ సందర్భంగా జగన్, లోకేష్ మధ్య తేడాలు కూడా చెప్పారు. కష్టాలు ఉన్నప్పుడే ఎవరైనా మార్గం వెదుక్కుంటారు. జగన్ కు ఒక్కసారిగా కష్టాలు వచ్చిపడ్డాయి. కష్టాల్ని ఎదుర్కొన్నాడు. కష్టపడ్డాడు. గెలిచాడు. లోకేష్ కు ఏం కష్టం వచ్చింది. అతడికి కష్టాలే లేవు.


ఇక మార్గం వెదుక్కోవాల్సిన పనే లేదు. టీడీపీ ఓటమి తర్వాత చంద్రబాబును కలిసి కొన్నాళ్లు మౌనంగా ఉండమని సలహా ఇచ్చానని చెప్పుకొచ్చిన జేసీ, తను మాత్రం ప్రస్తుతానికి టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టంచేశారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ తప్ప మరో పార్టీ ఉండదేమో అనే అనుమానాన్ని కూడా వ్యక్తంచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: