చంద్రబాబు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ. ఆయన ఎప్పటికపుడు చెప్పుకుంటున్నట్లుగా నలభయ్యేళ్ళ అనుభవం ఎన్నో సార్లు విమర్శలకు కూడా గురి అయింది. అపర చాణక్యుడు, రాజకీయ దురంధరుడు ఇల్లా ఎన్నో బిరుదులు కితాబులు అందుకున్న చంద్రబాబు ఇపుడు అమావాస్య చందమామ.


ఈ విషయంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు మాట్లాడుతూ చంద్రబాబు తాజా ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో ఆయన కెరీర్ దాదాపుగా ముగిసినట్లైందని చెప్పేశారు. బాబుకు చివరి చాన్స్ ఇచ్చింది మోడీ అన్నారు. 2014 ఎన్నికల్లో విభజన వల్ల ఏపీని ఆదుకుంటూ మోడీ బాబుకు ఓ అవకాశం ఇచ్చారని, మోడీతో పోటీ చేసి బాబు గెలిచి ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు. అలా గెలిచిన బాబు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదని మురళీధరరావు హాట్ కామెంట్స్ చేశారు.


దాని ఫలితమే బాబుకు దారుణమైన ఓటమి ఎదురైందని ఇపుడున్న పరిస్థితుల్లో టీడీపీ కానీ, బాబు కానీ కోలుకోవడం చాలా కష్టమని ఈ బీజేపీ నేత తేల్చేశారు. అంటే ఓ విధంగా చంద్రబాబు పొలిటికల్ లైఫ్ క్లోజ్ అన్నట్లుగా ఆయన మట్లాడారు. రాజకీయ వాతావరణం, టీడీపీలో ఉన్న నాయకత్వ సవాల్, బాబు ముందున్న అవకాశాలు ఇవన్నీ ద్రుష్టిలో పెట్టుకునే మురళీధరరావు ఈ కామెంట్స్ చేసి ఉంటారని అంటున్నారు. ఏది ఏమైనా ఒకనాటి మిత్రుడు బాబు భవిష్యత్తు చెప్పడం అంటే అంతకంటే బాధ మరోటి ఉండదేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: