కృష్ణపట్నం - ఓబులవారిపల్లె రైల్వే లైన్లో జూన్‌ 20 నుంచి ఎలక్ట్రిక్‌ ట్రాక్షన్‌ ప్రారంభం

17 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కృష్ణపట్నం - ఓబులవారిపల్లె రైలు మార్గం ఎట్టకేలకు పూర్తయ్యింది. సుదీర్ఘకాలంగా సాగిన ఈ పనులు ఇటీవల పూర్తికావటంతో కోస్తా- రాయలసీమ జిల్లాలను కలిపేందుకు మార్గం సుగమమైంది. ప్రయాణీకులకు సౌకర్యంతో పాటు వస్తు సరుకుల రవాణాకు ఆ రైలు మార్గం అనుకూలంగా ఉంటుంది.

ఇంతకాలం నెల్లూరు నుంచి కడప జిల్లాకు రైలు మార్గం లేకపోవటంతో బస్సు ఇతరత్రా రవాణా మార్గాలనే ఆశ్రయించాల్సివచ్చింది. ఇకపై రైలు మార్గం రావటంతో ఆ జిల్లాల మధ్య ఉన్న ప్రజానీకానికి ప్రయాణ మార్గం సుగమమైంది. అనేక ప్రజా పోరాటాల ద్వారా ఈ రైల్వే లైన్‌ పూర్తయ్యింది. తొలుత ఆ రైలు మార్గాన్ని కృష్ణపట్నం ఓడరేవుకు ఖనిజ ముడిసరుకు, అంతర్జాతీయ ఉత్పత్తుల రవాణాకు నిర్మించారు. అనంతరం ప్రయాణీకుల రవాణాకు కూడా అనుకూలంగా ఈ మార్గాన్ని విస్తరించారు.

2004 లో ఈ ప్రాజెక్టుకు అనుమతి లభించింది. యుపీఏ ప్రభుత్వ హయాంలో నిధుల కొరత తలెత్తిన కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి. 2014లో ఈ నిర్మాణ పనులు ఊపందుకుని రూ.1950 కోట్ల వ్యయంతో పూర్తయ్యాయి. కాగా నుల్లూరు జిల్లా వెలిగొండ వద్ద టెన్నల్‌ పనులు పెండింగ్‌లో ఉండటంతో మరికొంత ఆలస్యమైంది. ఈ టెన్నల్‌ 7.5 కిలో మీటర్ల పొడవు కలిగి ఉంది. ఆసియాలోనే అతిపెద్ద సొరంగ మార్గంగా కృష్ణపట్నం - ఓబులవారిపల్లె రైలు మార్గం నిలుస్తుంది. జూన్‌ 20న ఈ మార్గంలో ఎలక్ట్రికలత్‌ ట్రాక్షన్‌ను నిర్వహించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: