అసెంబ్లీ సాక్షిగా జగన్ ఎప్పుడైతే ఫిరాయిపులు గురించి తనకు ఎంత మంది టచ్ లో ఉన్నారో .. అని జగన్ మాట్లాడటంతో టీడీపీ నాయకుడు చంద్రబాబుకు ఒకింత వణులైతే పుట్టిందని చెప్పాలి. అందుకే తాజాగా వైసీపీతో టచ్ లో ఉన్న ఆ పది మంది ఎమ్మెల్యేలు ఎవరు అని చంద్రబాబు శూలశోధన మొదలు పెట్టినట్టు తెలిసింది. వైసీపీ ప్రతిపక్షంగా ఉన్న సమయంలో అసంతృప్తులు - పార్టీ మారే వారిని గుర్తించి ఆపరేషన్ ఆకర్ష్ అమలు చేయడంలో బాబు ఆరితేరారు.


పైగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ. అందుకే ఆ గోడదూకే ఎమ్మెల్యేలను నిగ్గుతేల్చాలని.. వారిని పార్టీ మారకుండా చూడాలని బాబు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.తాజాగా ముగ్గురు సీనియర్లతో చంద్రబాబు పార్టీ మారే అవకాశం ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల నిగ్గుతేల్చాలని కమిటీ ఏర్పాటు చేసినట్టు సమాచారం. రంగంలోకి దిగిన ఈ కమిటీ ఇప్పటికే ఐదురుగు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేశారని తేల్చినట్టు తెలిసింది.


అయితే టీడీపీ అనుమానిస్తున్న ఆ ఐదుగురు జంపింగ్ ఎమ్మెల్యేల్లో ప్రధానంగా విశాఖ నగరంలో గెలిచిన గంటాతోపాటు ఈస్ట్  - వెస్ట్ - సౌత్ ఎమ్మెల్యేలే ఉన్నట్టు సమాచారం. వీరు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు వైసీపీతో సంప్రదింపులు జరిపినట్టు టీడీపీ అనుమానిస్తోందట...ఈ మేరకు పార్టీలో జంపింగ్ లో ఒకటే చర్చ జరుగుతోందట.. అయితే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు వారిని ఎలా కట్టడి చేస్తారు? దీనికి ఏ మంత్రి పటిస్తారన్నది ఆసక్తిగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: