చంద్రబాబూ మీరు కూర్చున్న కుర్చీ మీది కాదు. మీ ప్రతిపక్ష హోదా నా దయ మాత్రమే సుమా అని గుర్తు చేసి మరీ ఎక్కడ పొడవాలో అక్కడే గట్టిగా కుళ్ళబొడిచారు. మరి ఈ అవమాన భారం బాబును కంటి నిండా కునుకు తీయనిస్తుందా అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది. బాబును చూసిన వారు పగవారికి కూడా ఈ రకమైన రాజకీయ దైన్యం రాకూడనే అంటున్నారు.


 ఇటు ఏపీ అటు తెలంగాణా రెండు రాస్ట్రాల్లోని నాయకులు బాబు గతంలో చేసిన పాపాలే ఇపుడు శాపాలుగా మారి ఇలా ఆయనకు శిక్ష వేశాయని కూడా విశ్లేషిస్తున్నారు. నీతి లేని రాజకీయాలు చేస్తే ఎవరికైనా ఇదే జరుగుతుందని, కాకపోతే రోజులు మారాక హవా తగ్గిపోయాక అనుభవించాల్సిఉంటుందని కూడా అంటున్నారు. నిజానికి జగన్ అన్న మాటలను విన్న వారంతా అది నిజంగా జగన్ దయ ప్రాప్తం వల్లనే బాబు ప్రతిపక్ష స్థానంలో కూర్చుని ఉండగలుస్తున్నారనే అంటున్నారు.


 జగన్ తలచుకుంటే బాబు ఒక్కరు మాత్రమే  అ పార్టీలో మిగిలినా ఆశ్చర్యపోనవసరం లేదని కూడా అంటున్నారు. నిజానికి ఫిరాయింపులు ఎవరు చేసినా తప్పే కానీ ఇక్కడ జగన్ బాధితుడు కాబట్టి ఒకవేళ ఆయన చేసినా జనాలు సైతం ఆమోదించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కానీ జగన్  అలా చేయనని, దయ  తలుస్తున్నానని పెద్ద మాట వాడి బాబును ఎక్కడ హర్ట్ చేయాలో అక్కడ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: