పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గట్టి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసినట్లే కనిపిస్తోంది. మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును సందర్శించబోతున్నారు. ఇంతకాలం పోలవరమని, పోలవారమని కథలు చెప్పిన చంద్రబాబు పెద్ద షో చేసిన విషయం అందరూ చూసిందే. ప్రతీ సోమవారం పోలవరంపై సమీక్షలని, ఏరియల్ వ్యూ అని, క్షేత్రస్ధాయి పరిశీలనంటూ ఎంతో హంగామా చేసిన చంద్రబాబు చిరవకు చేసిందేమీ లేదన్న విషయం అందరికీ తెలిసిందే.

 

అయితే అదే పద్దతిలో కాకుండా జగన్ మాత్రం పోలవరం పనులను పరుగులెత్తించాలని నిర్ణయించుకున్నారు. అందుకనే 20వ తేదీన తానే ప్రత్యక్షంగా ప్రాజెక్టు సైట్ దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. భూసేకరణ, పునరావాసంపై సైట్ లోనే ఉన్నతాధికారులతో సమీక్ష చేయబోతున్నారు.

 

ఇప్పటి వరకూ జరిగిన హెడ్ వర్క్స్, కుడి, ఎడమ కాలువలను అనుసంధానించటం, నివిగేషన్ కెనాల్ పనులు జరుగుతున్న తీరు, పవన్ ప్రాజెక్టు పనులు తదితరాలను అక్కడే సమీక్షించాలని నిర్ణయించారు. 20వ తేదీ జగన్ పర్యటన కారణంగా ఒక్కరోజు ముందే అంటే 19వ తేదీనే జలవనరుల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ప్రాజెక్టు దగ్గర క్యాంపు వేయనున్నారు. ముందుగా మంత్రి కూడా సమీక్ష చేయనున్నారు.

 

పోలవరం ప్రాజెక్టును వీలైనంత తొందరగా పూర్తి చేసేందుకు జగన్ టైం టేబుల్ వేసుకున్నారట. చంద్రబాబు మాదిరిగా కేవలం షోలకే పరిమితం కాకుండా పనులను పరుగులు పెట్టించాలని నిర్ణయించుకున్నారట. అదే సమయంలో కేంద్రం నుండి రాబట్టాల్సిన నిధులను రాబట్టేందుకు కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేశారట.

 

పోలవరం నిధులను విడుదల చేసేందుకు మొన్నటి ఢిల్లీ టూర్ లో ప్రధానమంత్రితో కూడా మాట్లాడినట్లు సమాచారం. ఇప్పటి వరకూ చేసిన ఖర్చును కేంద్రానికి అందిస్తామని కాబట్టి వెంటనే నిధులను విడుదల చేయాలన్న జగన్ విజ్ఞప్తికి ప్రధాని సానుకూలంగా స్పందించారట. వివిధ కారణాలతో ఆగిపోయిన సుమారు రూ. 4 వేల కోట్లను కేంద్రం ఇప్పటికే విడుదల చేసింది. కాబట్టి పోలవరం పెండింగ్ నిధులు కూడా విడుదలవుతాయని అనుకుంటున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: