ఏపీ రాజకీయాల్లో చూడని సీన్లు కొన్ని ఎపుడు జరుగవు అనుకున్నవి కూడా జరుగుతున్నాయి. చంద్రబాబు ఏపీకి శాశ్వతం ముఖ్యమంత్రి అనుకున్నారు. కానీ అయిదేళ్ళు తిరిగేసరికి విపక్ష పాత్రలోకి వెళ్ళిపోయారు. జగన్ ఈ వైపు వచ్చి సీఎం గా అధికార దరహాసం చిందించారు. ఇది ఎవరూ వూహించారు.మరి. 


ఇదిలా ఉండగా ప్రస్తుత సమావేశాలో ఓ విశేషం జరిగింది. జగన్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి శాసనమండలిలోకి అడుగు పెట్టారు. మొదటిసారు ముఖ్యమంత్రి సభకు  వస్తున్నారని తెలియడంతో సభ్యులంతా గౌరవంగా తమ సీట్ల నుంచి లేచి ఆయన పట్ల తమ మర్యాదను చాటుకున్నారు. ఆ సమయంలో సభలో ఉన్న లోకేష్ సైతం లేచి నిలబడి జగన్ పట్ల తన గౌరవాన్ని చాటుకున్నారు. ఇక సీనియర్ నేత యనమల రామక్రిష్ణుడు వంటి సీనియర్లకు, శాసనమండలి చైర్మన్ షరీఫ్ కి జగన్ అభివాదం చేయడమే కాదు. మొత్తం మండలి సభ్యులకు ఆయన  ప్రతి నమస్కారం చేశారు. 


ఇక లోకేష్, జగన్ ఒకే సభలో ఉండడం..ఇది ఓ రేర్ సన్నివేశమే. జగన్ అసెంబ్లీలో ఉన్నపుడు లోకేష్ మంత్రిగా లేరు. ఆయన మంత్రి అయిన తరువాత అసెంబ్లీని జగన్ అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. దాంతో ఈ ఇద్దరు యువ నేతలు ఎక్కడా కలిసే అవకాశం లేకుండా పోయింది. ఇపుడు ముఖ్యమంత్రి  హోదాలో జగన్ మండలికి వెళ్ళినందువల్ల అక్కడ లోకేష్ ఉండడం అలా  తటస్థించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: