Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 6:49 am IST

Menu &Sections

Search

అడకత్తెరలో పోకచెక్కలా టీడీపీ

అడకత్తెరలో పోకచెక్కలా టీడీపీ
అడకత్తెరలో పోకచెక్కలా టీడీపీ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
- కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో వైసీపీ
- బాబు 40ఏళ్ల అనుభవానికి పరీక్ష! 
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. కేంద్రంలో బీజేసీ... రాష్ట్రంలో వైసీపీతో తీవ్రంగా అంతర్ఘత రాజకీయ యుద్దం చేస్తోంది. ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు కేంద్రంలో మోదీ..ఏపీలో జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా పోరాడిన చంద్ర‌బాబుకు తాజా ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో ఇబ్బందిక‌ర వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. అందులో భాగంగా..టీడీపీ ఏపీలో కేవ‌లం 23 సీట్ల‌కే ప‌రిమితి కావ‌టం తో ఆ పార్టీలోని నేత‌లు ఒక ర‌కంగా రాజ‌కీయంగా అభ్ర‌ద‌తా భావంతో ఉన్నారు. అదే విధంగా ఇప్ప‌టికే కొంద‌రు ఎంపీ లు బీజేపీతో టచ్‌లోకి వెళ్లార‌నే వార్త‌లు చంద్ర‌బాబును క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తున్నాయి.

కేంద్రంలో మోదీ-అమిత్ షా ఇద్ద‌రూ త‌మ పార్టీ ఎంపీల‌ను లాగేసుకుంటార‌ని ముందు నండీ చంద్ర‌బాబు అంచనా వేస్తూనే ఉన్నారు. అయితే, ఏపీ లో మాత్రం జ‌గ‌న్ త‌న‌ంతట తానుగా ఫిక్స్ చేసుకున్న విధానాల కార‌ణంగా ఇప్ప‌టికిప్పుడు ఇబ్బంది లేద‌ని..అయితే వైసీపీ పాల‌న‌లో లోపాలు లేక‌పోతే..భ‌విష్య‌త్‌లో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌రి..అటు ఢిల్లీలో ఇటు అమ‌రావ‌తిలో చంద్ర‌బాబు త‌న టీం ను ఎలా కాపాడుకుంటారో చూడాలి. అక్క‌డ ఢిల్లీలో బీజేపీ..ఏపీలో వైసీపీ ఇప్పుడు చంద్ర‌బాబును టెన్ష‌న్ పెడుతున్నాయి. ఇదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఢిల్లీలో బీజీపీ చీఫ్ అమిత్‌షాతో క‌ల‌వ బోతున్నారు. ఇంత‌కీ ఏం జ‌రుగుతోంది. 


రాజ్యసభాపక్షనేతగా కేంద్రమంత్రి థవార్‌చంద్ గెహ్లాట్‌కు దక్కిన అవకాశం. పార్ల‌మెంట్ స‌భ్యులే టార్గెట్‌గా.. పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల్లో టీడీపీ స‌భ్యులను బీజేపీ టార్గెట్ చేసింది. వారిని త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. రాజ్య‌స‌భ‌లో ఇప్ప‌టికే బీజేపీ సంఖ్య ప‌రంగా మైనారిటీలో ఉంది. దీంతో..ఇత‌ర పార్టీల నుండి త‌మ వైపుకు వ‌చ్చే వారిని గుర్తించే ప‌ని మొద‌లు పెట్టింది. ఇందులో భాగంగానే రాజ్య‌స‌భ లో టీడీపీ ఎంపీలు ఆరుగురి పైన దృష్టి పెట్టిన‌ట్లు చెబుతున్నారు. అందులో ముగ్గురు ఎంపీలు ఇప్ప‌టికే బీజేపీతో ట‌చ్ లోకి వెళ్లిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

టీడీపీ ఎంపీలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేర‌టం గ‌త చ‌రిత్ర అధ్య‌య‌నం చేసిన వారికి ఆశ్చ‌ర్య అనిపించ‌దు. అదే విధంగా లోక్‌స‌భ‌లో ప్ర‌స్తుతం టీడీపీకి ముగ్గురు స‌భ్యులుండ‌గా ..వారిలో ఒక‌రు ఇప్ప‌టికే బీజేపీతో ట‌చ్‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఏపీలో టీడీపీకి తాజా ఎన్నిక‌ల్లో 23 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉంది. అదే విధంగా..వైసీపీలో 35 మంది స‌భ్యులుగా ఉన్నారు. అయితే, స్పీక‌ర్ ఎన్నిక స‌మ‌యంలో స‌భా సాక్షిగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న‌తో టీడీపీ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ని స్ప‌ష్టంగా చెప్పారు. అయితే, సంఖ్య మాత్రం తాను చెప్ప‌న‌ని తేల్చారు.

ఇక‌, వైసీపీ నేత‌లు సైతం 8 మంది వైసీపీతో ట‌చ్‌లో ఉన్నార‌ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో టీడీపీ ఎమ్మెల్సీలు సైతం ఇద్ద‌రు ఇప్ప‌టికే వైసీపీ నేత‌ల‌తో మంత‌నాలు చేస్తున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. అయితే, వారికి ఉన్న ప‌ద‌వుల‌ను వీడ‌టం తో పాటుగా పార్టీకి రాజీనామా చేసి వ‌స్తేనే వైసీపీలోకి ఎంట్రీ ఉంటుంద‌ని జ‌గ‌న్ ఇప్పటికే స్ప‌ష్టం చేసారు. దీంతో.. టీడీపీ కొంత ఊపిరి పీల్చుకుంటున్నా..ఖ‌చ్చితంగా జ‌గ‌న్ మాత్రం త‌మ‌ను దెబ్బ తీస్తార‌నే ఆందోళ‌న లోలోప‌ల టీడీపీ ముఖ్య నేత‌ల‌ను వెంటాడుతూనే ఉంది.


tdp-is-suffering-between-bjp-and-ysrcp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇంకా కొనసాగుతున్న ఉద్యోగ బది"లీలలు"
పర్యటకాభివృద్ధితో జీవనోపాధి మెరుగు - మాజీ వీసీ ప్రొఫేసర్ లజపతిరాయ్
' ఏ.పి విద్యుత్ ఒప్పందాల అవినీతి పై సమీక్షించాలి 'విద్యుత్ భారాలను తగ్గించాలి  -కేంద్రప్రభుత్వ ఆటంకాలు తగవు'ప్రభుత్వానికి లేఖ ద్వారా వినియోగదారుల సంఘం మద్దతు
నాటుసారాపై ఉక్కుపాదం. - ఆలమూరు ఎక్సైజ్ సిఐ పట్టాభి చౌదరి .
జగన్ మరో సంచలనం..మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులపై నజర్!
భారి అగ్ని ప్రమాదం - 31 పూరిల్లు దగ్దం
రైతుల మొరను ఆలకించేదెవరు?
నిలిచిన జాతీయ రహదారుల విస్తిరణ పనులు - అడ్డుకుంటున్న సత్యవరం గ్రామస్థులు
చిన్నపాటి ఘర్షణ  ప్రాణం తీసింది -కుళాయి వద్ద కొట్లాటలో మహిళ మృతి
పోడు భూముల పై  గిరిజనులకు హక్కులు - ప్రభుత్వ నిర్ణయంతో దశ మారనున్న ఏజెన్సి రైతు
కొనసాగుతున్న ఇసుక మాఫియా దందా..
పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాలి -మాజీ ఎమ్మెల్యే డా.బాచిన చెంచు గరటయ్య.
ఆధార్ కేంద్రాల్లో అన్నీ సమస్యలే..  -ఆధార్ నెంబర్ కోసం పడిగాపులు కాస్తున్న ప్రజానీకం .
వైద్యులు బదిలీ..ఉద్యోగులు కదిలే.. - ఉద్యోగుల స్థానచలనంతో రిమ్స్ హాస్పటల్లో రోగుల ఇక్కట్లు.
ము(మ)ందుకు రాని వ్యాపారులు.
గొట్టా బ్యారేజీ..పారేదెట్టా.. -ఉద్యోగులు , సిబ్బంది కొరతతో  గొట్టా బ్యారేజీ నిర్వాహణలో లోపం.
అన్నదాతల ఎదురు చూపులు  ఇంకెన్నాళ్లు?
సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నా బీసీ సంక్షేమ శాఖ  కార్యాలయం..
ఐటీడీఏ పరిధి లో మెరుగైన వైద్య సేవలు
ఆలయాల్లో ఇక నిత్య పూజలే
గ్రామ వాలంటీర్ ఇంట్వ్యూల్లో ఇంటర్ మీడియెట్ విధ్యార్దులతో పీజీ విధ్యార్దులు పోటీ
ఉద్యోగుల బదిలీల్లో భారీగా బేరసారాలు
భవన నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవు - మంత్రి ధర్మాన కృష్ణ దాస్
కరువును ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం
అన్నదాతకు , వ్యవసాయానికి  వెన్నుదన్ను
నిన్నటి ఓటమే రేపటి గెలుపుకు మొదటి అడుగు - రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి కృష్ణ దాస్
కేసులు సత్వర పరిష్కారానికి రాజీ మార్గమే రాజమార్గమనం - జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు బబిత
బీజేపీలో చేరిన తర్వాత తొలిసారిగా ఏపీకి వస్తోన్న సుజనా చౌదరి
కలెక్టరేట్ లో  సీట్లు ఖాళీ
అంగన్ వాడీకలకు అండగా - మంత్రి కృష్ణ దాస్.
'వంశధార'కే మొదటి ప్రధాన్యత !
ఫుడ్‌ పాయిజిన్‌తో 50 మంది విద్యార్థులకు అస్వస్థత
ఏపీలో ఇక సర్కారీ మద్యం దుకాణాలు.. ఒక్కో షాపులో నలుగురికి జాబ్స్
నర్సులు బదిలీల్లో తీవ్ర అన్యాయం.!
భూగర్బ జలాల పెంపునకు చర్యలు..
విద్యుత్ శాఖాధికారుల బదిలీలలో జాప్యం.
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.