Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 8:07 am IST

Menu &Sections

Search

శ్రీవారి ఆభరణాలపై అనుమానం వ్యక్తం చేసిన ఏపీ మంత్రి

శ్రీవారి ఆభరణాలపై అనుమానం వ్యక్తం చేసిన ఏపీ మంత్రి
శ్రీవారి ఆభరణాలపై అనుమానం వ్యక్తం చేసిన ఏపీ మంత్రి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
 శ్రీవారి ఆభరణాలపై అనుమానాలు ఉన్నాయని ఏపీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు చెప్పారు.  ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత టీటీడీ అధికారులపై ఉందని  ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీవారి ఆభరణాల భద్రతపై ఉన్న అపోహలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని, త్వరలోనే తితిదే అధికారులతో సమీక్షిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో వంశ పారపర్యంగా వస్తున్న అర్చకత్వానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి ప్రకటించారు.

బుధవారం తెల్లవారుజామున  తిరుమల వెంకన్నను దేవాదాయ శాఖ మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాసులు  దర్శించుకొన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత  వెల్లంపల్లి శ్రీనివాసులు  తొలిసారిగా తిరుపతి వెంకన్నను దర్శించుకొన్నారు. తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు.

ప్రస్తుతం ఉన్న టీటీడీ పాలకవర్గాన్ని ఆర్డినెన్స్‌ ద్వారా తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు.  శ్రీవారి ఆభరణాల భద్రతను సమీక్షించనున్నట్టు తెలిపారు. టీటీడీలో తలెత్తిన అన్ని వివాదాలపై  విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొంటామన్నారు. రమణ దీక్షితులు, వంశపారంపర్య అర్చకుల ఇబ్బందులపై పరిశీలించి చర్యలు తీసుకొంటామని  ఆయన చెప్పారు.  టీటీడీకి చెందిన బంగారం తరలింపుపై విచారణ చేస్తామన్నారు. బంగారం తరలింపుపై ఆరోపణలు నిజమైతే చర్యలు తప్పవన్నారు. భక్తుల కానుకలతో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 
vampalli-srinivas
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తనదైన శైలిలో నెటిజన్లకు అనసూయ సమాధానం
రకుల్ కు 'ఇండియన్‌–2'లో అవకాశం
పోలీసుల స్పేషల్ డ్రైవ్... వారం రోజుల్లో 645 కేసులు నమోదు... ఎందుకంటే?
జాన్వీతో... కీర్తీ దోస్తీ
వ్యవసాయం తర్వాత చేనేత రంగానికి ప్రాధాన్యత... ఎమ్మెల్యే ఆళ్ల
కుమారస్వామి షాకింగ్ నిర్ణయం... సీఎంగా శివ కుమార్..?
ఉజ్జయిని బోనాలలో స్వర్ణలత భవిష్యవాణి
`హేయ్ మెనీనా..` మన్మధుడు-2 లిరికల్ సాంగ్ విడుదల
‘మన్మథుడు2’ వినూత్న ప్రచారం.... దర్శకుడు రాహుల్ కు చుక్కలు చూపించిన నాగార్జున
కన్ను కొట్టి చూసేనంట సుందరి...  రణరంగం రెండో పాట విడుదల
‘నిశ్శబ్ధం’ అంటున్నఅనుష్క
ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్స్ కు పీవీ సింధు
రాష్ర్టవ్యాప్తంగా 3,775 వార్డు సచివాలయాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నెల్
రేపు చంద్రయాన్ -2 ప్రయోగం
రాజేంద్రప్రసాద్ కొత్త చిత్రం `కాలేజ్ కుమార్`
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.