37 లక్షల ఎకరాలు సస్యశ్యామలం!! 

13 జిల్లాలోని 106 మండలాల్లో1581 గ్రామాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని అంచనా...

 కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని. రాష్ట్రంలో 20 జిల్లాల్లోని 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇందులో.. 18,25,700 ఎకరాలు కొత్త ఆయకట్టు కాగా, 18,82,970 ఎకరాలు స్థిరీకరణ. ఇందులో శ్రీరాంసాగర్‌ మొదటి, రెండో దశలతోపాటు నిజాంసాగర్‌, సింగూరు ప్రాజెక్టుల కింద ఆయకట్టు ఉంది.


కొత్త, స్థిరీకరించిన ఆయకట్టుకు 169 టీఎంసీలు కేటాయించింది. వ్యవసాయేతర రంగాలకు 56 టీఎంసీలను అందిస్తుంది. ఇందులో హైదరాబాద్‌ తాగునీటికి 30 టీఎంసీలు అందిస్తుంది.


అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాల తాగునీటి అవసరాలకు మరో 10 టీఎంసీలు కేటాయిస్తారు.

పారిశ్రామిక అవసరాలకు మరో 16 టీఎంసీలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అటు సాగునీటితోపాటు ఇటు తాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చనున్నందున కాళేశ్వరం బహుళార్థ ప్రాజెక్టుగా మారింది!! ( pic by shyammohan)

మరింత సమాచారం తెలుసుకోండి: