తెలంగాణ రాష్ర్టంలో అతి పెద్ద ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రారంభోత్సవానికి మూడు రోజుల క్రితం ఆ రాష్ర్ట సీఎం కె.చంద్రశేఖరరావు ఆంధ్రాకు వచ్చి సీఎం జగన్ కు ఆహ్వానం ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం జగన్ తెలంగాణ వెళ్ళనున్నారు. బహుళార్ధక సాధక ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరవుతున్నారు.

శుక్రవారం ఉదయం 7.55 నిమిషాలకు తాడేపల్లిలోని నివాసం నుంచి జగన్ బయలుదేరుతారు. ఉదయం 8గంటలకు హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 9.30 గంటలకు మేడిగడ్డ వద్దకు చేరుకుంటారు. ఉదయం 10.15 గంటలకు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో కేసీఆర్‌తో పాటు జగన్ పాల్గొంటారు.

11.00 గంటలకు కన్నెపల్లి పంప్‌హౌస్ చేరుకుంటారు. 11.40గంటలకు కన్నెపల్లి పంప్‌హౌజ్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1గంట నుంచి 1.30 వరకు భోజనం చేస్తారు. 1.30 గంటలకు కన్నెపల్లి పంప్‌హౌస్ నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 3గంటలకు సీఎం నివాసానికి చేరుకుంటారు జగన్. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు ఏపీ సీఎం జగన్ శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: