జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమి గురించి, తన సోదరుడు నాగబాబు సోషల్ మీడియాలో స్పందించారు. గత ఎన్నికల ఎంపీగా పోటీచేసి ఓటమి పాలైన నాగబాబు తాజాగా ఫేస్‌బుక్‌లో లైవ్‌లోకి వచ్చారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు చాలా కూల్‌గా సమాధానం చెప్పారు. కొత్తగా నేను టెలివిజన్ షోలు చేయడం లేదు. జబర్దస్త్ ఒక్కటే ప్రస్తుతం కమిట్ అయ్యాను. సినిమాల విషయానికి వస్తే నా ముందుకు వచ్చిన సినిమాలను అంగీకరిస్తున్నాను.


ప్రతీ సినిమాకు ఆరు, ఏడు రోజులపాటు షూటింగ్ ఉంటుంది. సినిమా జీవితం అలా సాగిపోతున్నది. మంచి పాత్రలు చేయాలని చూస్తున్నాను అని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రం గురించి నాకు తెలుసు. కథ గురించి పూర్తిగా తెలుసు. అద్భుతమైన స్వాత్రంత్ర్య సమరయోధుడి కథ. సినిమా పరిశ్రమలో గొప్ప చిత్రం అవుతుంది. కొన్ని సీన్లు కూడా చూశాను. తెర మీద బ్రహ్మండంగా ఉన్నాయి. కచ్చితంగా ఓ మంచి సినిమా అవుతుంది అని నాగబాబు చెప్పారు.


 పవన్ కల్యాణ్ ఓటమిపై నాగబాబు స్పందించారు. భీమవరం, గాజువాకలో ఓటమి దారుణం. పవన్ కల్యాణ్‌ను ఓడించడానికి రూ.150 కోట్లు ఖర్చు చేశారని పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పారు. కానీ అంతకంటే ఎక్కువగానే ఖర్చు చేశారని నా అభిప్రాయం. ఎన్నికల్లో పెద్ద మొత్తంలో డబ్బు, అధికార దుర్వినియోగం జరిగింది. కేంద్ర ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం పనిచేసింది అని నాగబాబు వెల్లడించారు.సి 

మరింత సమాచారం తెలుసుకోండి: