జగన్ ఎపుడూ ఒకే విధంగా ఉన్నారు. ఆయన 2009 నుంచి తాను అనుకున్న దారిలోనే నడుస్తున్నారు. నాడు సోనియా గాంధీని, ఆమె కోటరీని ఎదిరించినా,  తరువాత రోజుల్లో ఏపీలో చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి లతో ఒకేసారి తలపడినా, 2014 తరువాత ప్రతిపక్షంలో ఉంటూ బాబుతో ఢీ కొట్టినా జగన్ ఎపుడూ మడమ తిప్పలేదు, మాట తప్పలేదు.


అయీతే సీఎం అయ్యాక  కొంతమందికి జగన్ కొత్తగా కనిపిస్తున్నట్లుగా ఉన్నారు. మరీ ముఖ్యంగా  తెలుగు తమ్ముళ్ళకు జగన్ లోకి కొత్త కోణాలు కనిపిస్తున్నాట. జగన్ ఎంతైనా గ్రేట్ అంటున్నారు టీడీపీ ఫైర్  బ్రాండ్ బుద్దా వెంకన్న, మాటకొస్తే చాలు జగన్ మీద దారుణమైన పదజాలంతో విరుచుకుపడే వెంకన్న జగన్ని ఇపుడు పొగడడం ఆసక్తికరమే. జగన్ మాట మీద నిలబడతారు, ఏపీలో ఫిరాయింపులు తాము  ప్రోత్సహించమని జగన్ చెప్పారు, ఇది చాలా గొప్ప విషయం అని వెంకన్న అన్నారు.


తాను ఇదే విషయాన్ని శాసనమండలిలో కూడా చెప్పానని ఆయన పేర్కొన్నారు. జగన్ కు ఉన్న నిబద్ధత బీజేపీ నాయకులకు లేదని ఆయన వాపోయారు. తమ పార్టీ  నుంచి నలుగురు ఎంపీలను తీసుకోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక జగన్ విషయంలో బుద్దా వెంకన్న ఇలా ప్రశంసలు కురిపించడం ఇపుడు హాట్ టాపిక్ అయింది. పైగా తాము వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం కూడా తప్పేనని చెప్పడం ద్వారా వెంకన్న పూర్తిగా వైసీపీ వాయిస్ వినిపించేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: