తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మించిన ప్రాజెక్ట్ కాళేశ్వరం. అయితే  కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశిష్ఠ అతిధిగా రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్.. ముఖ్యఅతిధులుగా ఏపీ.. మహారాష్ట్ర ముఖ్యమంత్రులను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించటం తెలిసిందే. ఈ ఉదయం షెడ్యూల్ ప్రకారం మేడిగడ్డ బ్యారేజీ వద్ద వరుణుడి కరుణ కోసం వేద పండితులు జలసంకల్ప హోమాన్ని నిర్వహించారు.


శృంగేరీ పీఠానికి చెందిన ఫణిశశాంక్ శర్మ.. గోపీకృష్ణ ఆధ్వర్యంలో నలభై మంది వేదపండితులు హోం నిర్వహించారు. దీనికి ముందు గోదావరి మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆహ్వానించిన అతిధుల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేడిగడ్డకు తొలుత చేరుకున్నారు.


 జగన్ వెంట ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. అనిల్ కుమార్ యాదవ్  తదితరులు ఉన్నారు. హెలికాఫ్టర్ లో మేడిగడ్డకు చేరుకున్న జగన్ కు.. పలువురు తెలంగాణ మంత్రులు స్వాగతం పలికారు. గురువారం వర్షం పడిన నేపథ్యంలో.. ఈ రోజు వర్షం పడినా కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలుగకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: