అవును చంద్రబాబునాయుడు హయాంలో బాగా అతిచేసిన వారిలో ఇపుడు చాలామంది అల్లాడుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే చంద్రబాబు సిఎంగా ఉన్నపుడు ఆయన పేషీలో చీఫ్ ప్రిన్సిపుల్ సెక్రటరీగా సతీష్ చంద్ర ఉండేవారు. ఆయనతో పాటు రాజమౌళి, సాయిప్రసాద్, గిరిజాశంకర్ లాంటి ఐఏఎస్ లు ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి సిఎం అయి దాదాపు నెలరోజులవుతున్నా తాజా బదిలీల్లో కూడా వాళ్ళలో ఎవరికీ పోస్టింగ్ రాలేదు.

 

వాళ్ళంతా తాము ఐఏఎస్ అధికారులమని, నియమ నిబంధనల ప్రకారం పనిచేయాల్సుంటుందన్న విషయాలను మరచిపోయారు. వీరిలో సతీష్ చంద్ర అయితే మరీ అన్యాయంగా వ్యవహరించేవారని టిడిపి వర్గాలే చెబుతుంటాయి. చంద్రబాబును అడ్డంపెట్టుకుని సతీషే మొత్తం పాలనాయంత్రాంగాన్నంతా గుప్పిట్లో పెట్టుకున్నారట.

 

మామూలుగా అయితే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎంతో చీఫ్ సెక్రటరీ కూడా అంతే. కానీ చంద్రబాబు హయాంలో సతీష్ చంద్ర చీఫ్ సెక్రటరీ అనే ఓ బాస్ ఉన్నారన్న విషయాన్ని కూడా గుర్తించటానికి ఇష్టపడలేదని సమాచారం. మొత్తం ప్రభుత్వాన్ని సిఎంవోనే నడిపించేస్తోందని మాజీ చీఫ్ సెక్రటరీలు ఐవైఆర్ కృష్ణారావు, అజేయ్ కల్లం ఎన్నోసార్లు ఆరోపించిన విషయం తెలిసిందే.

 

చంద్రబాబు హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నట్లు సిఎంవో గతంలో ఎవరి హయాంలో కూడా  ఎదుర్కోలేదు. సతీష్ అండ్ కో  అంతలా భ్రష్టు పట్టించేశారు సిఎంవోను. సరే జగన్ సిఎం కాగానే సీన్ రివర్సయ్యింది. జగన్ సిఎం కాగానే ముందుగా సిఎంవోలు ఉన్న సతీష్, సాయిప్రసాద్, రాజమౌళి, గిరిజాశంకర్ ను జీఏడికి బదిలీ చేశారు.

 

గడచిన నెల రోజుల్లో రెండుసార్లు ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. అయితే పై నలుగురు ఉన్నతాధికారుల్లో ఒక్క గిరిజాశంకర్ కు తప్ప మిగిలిన ముగ్గురికి పోస్టుంగులు రాలేదు. వాళ్ళంతా పోస్టింగుల కోసం వెయిట్ చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం మొత్తాన్ని శాసించి ఇపుడు అనామక అధికారులుగా ఉండిపోవాల్సి రావటం నిజంగా చాలా బాధాకరమే. వాళ్ళకు జగన్ ఎప్పుడు పోస్టింగులు ఇస్తారో తెలీదు. అప్పటి వరకూ వాళ్ళు అతి చేస్తే ఫలితం ఇలాగే ఉంటుందని అందరూ ఇపుడు మాట్లాడుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: