రాజకీయాల్లో అద్రుష్టవంతులుగా కొందరు ఉంటారు. వారిని ఎవరూ ఏమీ చేయలేరు. దశ బాగుంటే వారు అలా పై పైకి ఎదిగిపోతూనే ఉంటారు. టీడీపీలో సుజనా చౌదరి హవా గురించి చెప్పనక్కరలేదు. ఆయన చంద్రబాబు కి కుడిభుజంగా ఉండేవారు. ఆయన్ని రెండు సార్లు రాజ్యసభ సభ్యున్ని చేశారు. పార్టీకి సుజనా ఓ బలమైన బ్యాంక్ గా ఉంటూ వచ్చారు. 


సీన్ కట్ చేస్తే సుజనా చౌదరి బీజేపీలో చేరిపోయారు. రాత్రికి రాత్రి ఆయన జెండా ఎత్తేశారు. నలుగురు ఎంపీలతో గీత దాటేసిన సుజనా చౌదరి ఇపుడు బీజేపీ వారికి చాలా ప్రీయమైన నేస్తం. దాంతో సుజనా చౌదరి రుణం తీర్చుకోవాలనుకుంటున్నారు. ఆయనకు తొందరలోనే మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ వార్తలు చెబుతున్నాయి. గతంలో మోడీ క్యాబినెట్ లో పనిచేసిన సుజనా సహాయ మంత్రిగా ఉన్నారు. ఈసారి ఆ హోదాను పెంచుతూ ఇండిపెండెంట్ చార్జితో  కీలకమైన మంత్రిత్వ శాఖను అప్పగిస్తారని టాక్. అదే జరిగితే సుజనా పంట పండినట్లే.


ఇక తెలంగాణాలో కూడా మరో టీడీపీ ఎంపీ గరికపాటి రామ్మోహనరావుకు మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ పెద్దలు డిసైడ్ అయ్యారట. ఆయనకు సహాయమంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది. ఏపీ కోటాలో సుజనా చౌదరి పదవిని దక్కించుకుంటే తెలంగాణా కోటాలో గరికపాటి మినిస్టర్ హోదా సాదిస్తారన్న మాట. దీంతో ఏపీ రాజకీయాల్లో కూడా సుజనాచౌదరి పాత్ర బాగా పెరుగుతుందని అంటున్నారు. 22 మంది ఎంపీలు కలిగిన వైసీపీ ప్రతిపక్షంలో ఉంటే గోడ దూకేసిన మాజీ టీడీపీ నేతకు మాత్రం మంత్రి పదవి రావడం రాజకీయ విడ్డూరమే మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: