అన్ని రాష్ట్రాలకు ప్రభుత్వ కార్యక్రమాల గురించి ప్రజలను చైతన్య పరచడానిని సమాచార శాఖ ఉంటుంది. అలాగే ఏపీ సర్కారుకి కూడా సమాచార శాఖ ఉంది. ఈ శాఖ ద్వారా 'ఆంధ్రప్రదేశ్‌' పేరుతో మాసపత్రికను ప్రచురిస్తారు. విభజన తరువాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయాక ఈ పత్రిక పూర్తిగా మారిపోయింది.

ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు టీడీపీ ప్రభుత్వానికి ఒక ప్రచార బాకాగా మారి పోయింది.

పత్రికా రంగంలో అనుభవమున్న జర్నలిస్టులను టీంగా ఏర్పాటు చేసి, కందుల రమేష్‌ అనే జర్నలిస్టుకు ఎడిటర్‌ బాధ్యతలు అప్పజెప్పి, మల్టీకలర్‌లో పత్రికను చాలా రిచ్‌గా దాదాపు నెలకు అరకోటి బడ్జెట్‌తో ప్రచురించడం మొదలు పెట్టారు. ఇదంతా బాగానే ఉంది . వై.ఎస్‌.జగన్‌ సిఎం అయాక, ఇపుడు కథ మలుపు తిరిగింది.

ఆ ముచ్చటను కర్నూల్‌ దక్కన్‌ క్రానికల్‌ విలేఖరి ఆసక్తికరంగా రిపోర్ట్‌ చేశారు. గత ప్రభుత్వం మీద ప్రేమతో ,తమకు ఉద్యోగాలిచ్చినందుకు ఆభిమానంతో ముఖ్యమంత్రి జగన్‌ను కించపరిచేలా పత్రికను రూపొందించారట. తాజా జూన్‌ సంచికలో, జగన్‌ ప్రమాణ స్వీకార ఫొటోను నిరసనగా బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ముద్రించారట.

ఎంతో పాపులర్‌ అయిన 'జగన్‌ అను నేను' నినాదాన్ని ' ' జగన్‌ అనే అతడు'అని పెట్టారట.

ఈ విధంగా జగన్‌ ప్రభుత్వంలో ఈ పత్రికను ఎవరు పట్టించుకుంటారు లే అన్నట్టు ఇష్టం వచ్చినట్టు పత్రికను తయారు చేసి ప్రింట్‌ చేశారు. జగన్‌ పేషీలోని అధికారులు దీనిని గమనించి, కాపీలన్నింటినీ గోడౌన్‌ కి పంపారట.

దీని వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు అరకోటి వృధా అని ఓ అధికారి మాతో అన్నారు. ఇంత నిర్వాకం చేపి, ప్రభుత్వ ధనాన్ని వృధా చేసిన ఆ మ్యాగజైన్‌ టీమ్‌కి భవిష్యత్‌లో ఎలాంటి సత్కారం ఉంటుందో అని మీడియా సర్కిల్స్‌లో చర్చిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: