తెలుగుదేశం పార్టీ అంటే నారా చంద్రబాబునాయుడు అంటారు. 1995లో అన్న నందమూరిని దెబ్బ కొట్టిన తరువాత చంద్రబాబు జమానా మొదలైంది. ఇప్పటికి దాదాపుగా పాతికేళ్ళుగా తెలుగు రాజకీయాల్లో చురుగ్గా ఉన్న చంద్రబాబు కెరీర్ ఇపుడు ట్రబుల్లో పడింది.


తాజా ఎన్నికల్లో పార్టీ ఘోరాతిఘోరంగా ఓడిపోవడంతో చంద్రబాబు బాగా వీక్ అయ్యారు. దానికి తోడు పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడిపోవడం ఎమ్మెల్యేలు గట్టు దాటేస్తారని ప్రచారం జరగడంతో బాబు గారు తల్లడిల్లిపోతున్నరు. పార్టీకి యూత్ బ్లడ్ అవసరమని ఆయన గ్రహించారట.


అందుకే అర్జంట్ గా లోకేష్ ని వర్కింగ్  ప్రెసిడెంట్ గా ప్రకటిస్తారట. ఇకపై పార్టీని అంతా లోకేష్ భుజాలపైన వుంచుతారట. మరో వైపు కింజరపు రామ్మోహన్నాయుడుకు ఏపీ టీడీపీ అద్యక్ష పదవి అప్పగిస్తారట. ఆ విధంగా ఇద్దరు యువకులను ముందు పెట్టి తాను సైడ్ అవుతారట. ఇక బాబు గారు కేవలం డైరెక్షన్ మాత్రమే చేస్తూ బ్యాక్ సీటుకు వెళ్ళిపోతారట. మరి పార్టీని నడిపించే సత్తా లోకేష్ బాబుకు ఉందా. అస‌లే ఆయన్ని తమ్ముళ్ళు టార్గెట్ చేస్తున్న టైంలో ఈ పదవి ఇస్తే అది సైకిల్ పార్టీకి ప్లసా, మైనసా..


మరింత సమాచారం తెలుసుకోండి: