టీడీపీ జాతీయ పార్టీ. అదే పెద్ద కామెడీ. దేశంలో కనీసం నాలుగు రాష్ట్రాల్లోనైనా ఆరు శాతం ఓట్ల వాటా  ఉంటేనే  జాతీయ పార్టీగా గుర్తిస్తారు. కానీ టీడీపీ తెలంగాణాలో మటాష్. ఏపీలో అతి చిన్న పార్టీ అయిపోయింది. ఇక జాతీయ అధ్యక్షుడు, ఏపీ కి మరో అధ్యక్షుడు తమ్ముళ్లకు చెప్పుకోవడానికే ఈ పదవులు. కళా వెంకటరావు నిజానికి ఏపీ ప్రెసిడెంట్ అంటే ఆయనకే బహుశా  తెలియదేమో.


ఇపుడు ఎటూ ఎన్నికల్లో ఓడిపోయారు. దాంతో కళా అసలు మాటే లేకుండా పోయారు. ఫలితాలు వచ్చి నెల రోజులు అవుతోంది. కళా మాత్రం నోరు విప్పడం లేదు. ఈ లోగా నలుగురు రాజ్యసభ టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరిపోయారు. బాబు గారు విదేశాల్లో ఉన్నారాయే. మరి ఏపీ అధ్యక్షుడిగా కళా ముందుకు రావాలి.  పార్టీ ఏమైందో ఆరా తీయాలి. మీటింగులు పెట్టి క్యాడర్ కి ధైర్యం చెప్పాలి.


అసలు కళా ఎక్కడ ఉన్నారో తమ్ముళ్ళకే తెలియడంలేదుగా. లోకేష్ బాబు విదేశాల నుంచి ఫోన్ చేసి అసలు ఏం జరిగిందో చెప్పమని కళాను కోరారట. మరి దానికి కూడా బదులు లేదాయే. అసలే ఆ మొక్కుబడి పదవి కూడా వూడిపోతుందని కళా ముందే టామ్ టామ్  కొడుతున్నారు. ఇంక ఈ తమ్ముడు ఎందుకు నోరు తెరుస్తాడు, మరెందుకు జోక్యం చేసుకుంటారు. అసలే ఇల్లు కాలి ఆయన బాధపడుతూంటే పార్టీ గొడవలు కూడానా.


మరింత సమాచారం తెలుసుకోండి: