ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి ఇంకా నెల రోజు కూడా కాలేదు. అపుడే 2024న మేమే అధికారంలోకి వస్తామంటూ ఓ వైపు బీజేపీ, మరో వైపు టీడీపీ, ఇంకోవైపు జనసేన భారీ స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి. ఇక జగన్ విషయానికి వస్తే అయిదేళ్ళకు సరిపడా ప్రణాళికలు పెట్టుకుని టార్గెట్ 2024 అంటున్నారు.


మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏపీలో 2022 నాటికే మళ్ళీ ఎన్నికలు వస్తాయన్న సమాచారం వైసీపీ నేతలను హడలెత్తిస్తోంది. అంటే కేవలం మూడేళ్ళకే వైసీపీ అధికారం కోల్పోతుందన్నమాట. ఇది చాలా దారుణమే మరి. అయిదేళ్ళకు జగన్ ఓటేసి గద్దెను ఎక్కిస్తే మూడేళ్ళకే ప్రభుత్వం రద్దు కావడమేంటి అంటే దీని వెనక కధ ఉందని అంటున్నారు.


కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ జమిలి ఎన్నికల ప్రతిపాదన తీసుకువచ్చింది. ఒకేమారు కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిపించాలన్నది బీజేపీ కొత్త విధానం. దీని మీద అఖిల పక్ష భేటీ కూడా జరిగింది. దీని సారాంశం  ప్రకారం 2022 నాటికి దేశంలో అప్పటికి అధికారంలో రాష్ట్రాలతో పాటు గడువు తీరిన అసెంబ్లీలు అన్నీ కలుపుకుని ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారట. 


దీని వల్ల ఇంకా రెండేళ్ళ అధికారం ఉన్నా కూడా జగన్ సర్కార్ కోల్పోయి ఎన్నికలను ఎదుర్కోవాలన్నమాట. ఓ విధంగా ఇది ఫ్యాన్ పార్టీ వారికి చేదు వార్తే. పదేళ్ళ పోరాటం తరువాత 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీకి మూడేళ్ళ అధికారం మాత్రమే ఉండడం అంటే దారుణాతి దారుణమే. మరి అదే జరిగితే జగన్ అండ్ కో ప్రతిస్పందన ఏంటో.



మరింత సమాచారం తెలుసుకోండి: