కేంద్రమాజీ మంత్రి, బిజెపిలోకి ఫిరాయించిన టిడిపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మరీ బరి తెగించేశారు. ఆయనపై దేశం మొత్తం మీద అసలు కేసులే లేవట.  ఏ ఒక్కరూ తనపై ఎక్కడా కేసు పెట్టలేదట. ఎవరూ దర్యాప్తు చేయటం లేదన్నట్లుగా చెప్పారు. సుజనా చెప్పిన విషయాలు విన్న తర్వాత ఆయన ఎంతకు బరితెగించారో అర్ధమైపోతోంది.

 

దాదాపు రూ. 9 వేల కోట్ల ప్రజా ధనాన్ని సుజనా బ్యాంకుల నుండి దోచేశారన్నది వాస్తవం. దానికి సంబంధించి ఆయన కేసులు ఎదుర్కొంటున్నారు. మనీ ల్యాండరింగ్, డొల్ల కంపెనీల ఏర్పాటు ద్వారా వందల కోట్లను దేశం దాటించేశారని ఆయనపై అభియోగాలున్నాయి. ఇదే విషయమై సిబిఐ, ఈడి, ఐటి లాంటి దర్యాప్తు సంస్ధలు ఎన్నో సార్లు దాడులు చేశారు.

 

బెంగుళూరు కార్యాలయంలో  విచారణకు హాజరుకావలని సిబిఐ  నోటీసులిస్తే అరెస్టుకు భయపడి తప్పించుకు తిరిగిన ఎంపి ఈయన. ఇక మారిషస్ లోని మర్కంటైల్ బ్యాంక్  నుండి రూ 100 కోట్లు ఎగొట్టిన కేసు ఈయన మెడకు గతంలోనే చుట్టుకుంది. కేంద్రమంత్రిగా ఉన్నపుడు సుజనా అరెస్టుకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే.

 

కోర్టు జారీ చేసిన నాన్ బెయిల్ బుల్ అరెస్టు వారెంటును చచ్చి చెడి రద్దు చేయించుకున్న విషయం ఎవరికి తెలీదు.  కేసుల్లో ఎప్పుడు అరెస్టు అవుతారో అన్న భయంతో సుజనా లో టెన్షన్ పెరిగిపోతోంది. అందుకే కేసుల్లో నుండి బయటపడేందుకు బిజెపిలో చేరారన్నది వాస్తవం. సుజనా ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా అందరికీ తెలిసిన నిజం ఇదే.

 

ఎప్పుడైతే బిజెపిలో చేరారో వెంటనే బరితెగించేశారు. తనపై దేశం మొత్తం మీద అసలు కేసులే లేవంటున్నారు. తనపై ఎవరూ ఎక్కడా కేసే పెట్టలేదట. తనపై దర్యాప్తు సంస్ధలేవీ అసలు విచారణే చేయటం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఒకవైపేమో కేసుల నుండి బయటపడేసేదుకు తాము ఎవరికీ హామీలు ఇవ్వలేదని తమ అభియోగాలను వాళ్ళు ఎదుర్కోవల్సిందేనంటూ బిజెపి చెబుతోంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో ?


మరింత సమాచారం తెలుసుకోండి: