ప్రజావేదికను రెండు రోజుల్లో కూల్చేయబోతున్నామని జగన్ సంచలన ప్రకటన చేసిన సంగతీ తెలిసిందే. అక్రమ కట్టడాలన్నింటిని కూల్చేస్తామని చెప్పడంతో బాబు గారి ఇల్లు కూడా కూల్చేయడం లాంఛనమే అని అందరూ భావిస్తున్నారు. అయితే ప్రజావేదిక కూల్చివేత వ్యాఖ్యపై  తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమకట్టడంగా అభివర్ణిస్తున్నారని.. అన్ని అనుమతులు తీసుకున్నాకే నిర్మించినట్లుగా చెబుతున్నారు.


ఈ నిర్మాణం వ్యవహారం కోర్టులో ఉందని.. ప్రజావేదికను తమకు కేటాయించాలని కోరుతూ సీఎం చంద్రబాబు లేఖ రాసిన తర్వాతే ఆ నిర్మాణం అక్రమంగా ఆరోపిస్తున్నారంటూ తప్పు పడుతున్నారు.బుధవారం ప్రజావేదికను కూలుస్తామని జగన్ చేసిన సంచలన వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు విలవిలలాడిపోతున్నారు. తాము నిర్మించామని గొప్పగా చెప్పుకునే భవనం అక్రమం కారణంగా కూల్చివేయటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.


దీనిపై ముఖ్యమంత్రి జగన్ పై తీవ్రంగా తప్పు పడుతున్నారు. అక్రమ కట్టడం అయినప్పుడు కలెక్టర్ల సమావేశాన్ని ఎందుకు నిర్వహించారని  టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ప్రశ్నిస్తున్నారు.కనీస సమాచారం ఇవ్వకుండా ప్రజావేదిక నుంచి సామాన్లు పడేశారన్న ఆమె.. తాము ప్రశ్నిస్తే.. ప్రభుత్వ కట్టటం మీకు చెప్పాల్సిన అవసరం లేదని సమాధానమిస్తున్నారన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: