జగన్ విధానాలు భిన్నంగా ఉంటాయి. ఆయనకు పాలన అనుభవం ఏముందని అడిగేవారికి దాదాపుగా నెల రోజులుగా సాగుతున్న పాలన నిదర్శనం. జగన్ మనసుతో పాలిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా వచ్చిన వైఎస్ జగన్ ది చంద్రబాబుకు పూర్తి భిన్నమైన వైఖరి. 


నేను 29 సార్లు ఢిల్లీ వెళ్ళాను, ప్రధానిని కలిశాను అని బాబు అంటే దాని వల్ల ప్రయోజనం ఏంటి అని జగన్ ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ వెళ్ళాలంటే దానికి ఒక ప్రణాళిక ఉండాలన్నది జగన్ ఆలొచనగా ఉంది. ఇక జగన్ ఏపీకి సంబంధించిన అంశాలు, విభజన హామీలు ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని డిమాండ్ చేయడం వంటి అంశాలన్నీ పూర్తిగా తన ఎంపీల మీదనే విడిచిపెట్టేశారు. ఏపీ నుంచి వైసీపీ తరఫున గెలిచిన 22 మంది ఎంపీలే రాష్ట్రానికి న్యాయం చేసేలా కేంద్రాన్ని వత్తిడి తీసుకురావాలని జగన్ భావిస్తున్నారు.


జగన్ తాను తరచూ డిల్లీ వెళ్ళి చంద్రబాబు మాదిరిగా పంచాయతీలు పెట్టడానికి ఇష్టపడడం లేదు. అలాగని సమస్యలను వదిలేయడం లేదు. నిరంతరం కేంద్రం చెవిలో జోరీగలా సమస్యలు చెప్పేందుకు వైసీపీ  ఎంపీలను ఆయన వాడుకుంటున్నారు. వారిని కొన్ని బ్రుందాలుగా విడదీసి కేంద్ర మంత్రిత్వ శాఖల వద్దకు పంపుతున్నారు. అలాగే వారి ప్రాంతాలకు కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు పనులు కూడా డిమాండ్ చేసి తీసుకువచ్చేందుకు కూడా ఈ ఎంపీల బ్రుందాలను ఉపయోగించుకోనున్నారు. మొత్తానికి జగన్ ప్లాన్ బాగుందిగా


మరింత సమాచారం తెలుసుకోండి: