వైసీపీ అధినేత జగన్ దూకుడే వేరు. ఆయన చాలా ఆకలిగా ఉన్నారు. అదే హామీలను నిలబెట్టుకోవాలని, పేరు తెచ్చుకోవాలన్నదే జగన్ తపన. నిజానికి ఏపీ క్యాబినెట్లో కానీ. అధికార వర్గాల్లో కానీ జగన్ స్పీడ్ ఎవరికీ అర్ధం కావడం లేదు. 


జగన్ ప్రజావేదికలో మీటింగ్ పెట్టారు. అక్కడే ఆయన సంచలన ప్రకటన చేశారు. ఇది పూర్తిగా అక్రమంగా కట్టింది. దీని వెంటనే కూల్చేయండి అంటూ తక్షణ ఆదేశాలు జారీ చేశారు. చివరి మీటింగ్ కలెక్టర్ల సమావేశం కావాలని జగన్ అన్నారు. మొత్తానికి జగన్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది.


అదే సమయంలో మేధావులు, ఏపీ అభివ్రుధ్ధిని కోరుకునే వారి నోటి వెంట మరో మాట వినిపిస్తోంది. అది అక్రమమో, సక్రమమో కానీ పెద్ద  కట్టడం, ప్రభుత్వ అంచనాలు నోటి మాటతో పెంచేసి మరీ 8 కోట్లకు ఎగబాకించి కట్టిన భవనం. దాన్ని కూల్చేస్తే ఇపుడున్న పరిస్థితుల్లో ఏపీలో కొత్త భవనం కట్టుకోవం కష్టమే. ఏపీ లోటు బడ్జెట్ లో ఉంది. మరి ఎనిమిది కోట్లు అంటే మాటలు కాదు.


జగన్ పొదుపు మంత్రం అని చెప్పి ఇలా కళ్ళ ఎదుట భవనాన్ని కూలగొట్టడం అంటే ఇబ్బందే. దానికి బదులుగా జగన్ నాడు ఎవరు అనుమతులు ఇచ్చి దగ్గరుండి కట్టించారో తమ్ముళ్ళ వద్ద నుంచి ఆ ఎనిమిది కోట్లు వసూల్ చేసి ఖజానాలో వేయాలని సూచిస్తున్నారు. అపుడే జగన్ చేసిన పనికి నూటికి నూరు శాతం న్యాయం జరుగుతుందని కూడా అంటున్నారు. మరి జగన్ ఆ పని చేయగలరా..


మరింత సమాచారం తెలుసుకోండి: