చూస్తుంటే అలాగే అనిపిస్తొంది అందరికి. తాజగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో దాదాపు గంటపాటు భేటీ అవ్వటమే ఇందుకు నిదర్శనం.  రాజకీయంగా వంగవీటి రాధా కృష్ణమూర్తి ఒక విధంగా  ఫెయిల్యూర్ లీడర్ అనే చెప్పుకోవాలి.  తండ్రి వంగవీటి మోహన రంగా వారసుడినని చెప్పుకోవటం తప్ప తనకంటూ సొంత అస్తిత్వాన్ని నిర్మించుకోలేకపోయారు.

 

రాజధాని జిల్లాల్లో కాపు సామాజికవర్గంకు బలమైన పునాదులున్నా దాన్ని కూడా అడ్వాంటేజ్ తీసుకోలేకపోయారు. పైగా తండ్రి నుండి వచ్చిన ఘనమైన వారసత్వాన్ని కూడా నిలుపుకోలేకపోయారు. ఎప్పుడు ఒక పార్టీలో ఉండకపోవటం, పార్టీ కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళ్ళలేకపోవటం లాంటి అనేక మైనస్ పాయింట్లున్నాయి  రాధాలో.

 

చాలా కాలం వైసిపిలో ఉన్న రాధా సరిగ్గా ఎన్నికలకు ముందు టిడిపిలో చేరారు. విజయవాడ అసెంబ్లీ సెంట్రల్ టికెట్ కోసమే జగన్మోహన్ రెడ్డితో విభేదించిన రాధా టిడిపిలో చేరి టికెట్ తెచ్చుకున్నారా అంటే అదీ లేదు. పోనీ అందులోనే కొనసాగే ఆలోచనలో ఉన్నారా అంటే అది డౌటే.

 

టిడిపిలో కొనసాగే ఉద్దేశ్యమే ఉంటే పవన్ తో ఎందుకు భేటీ అవుతారు ? ప్రజారాజ్యంపార్టీలో ఉన్నప్పటి నుండి పరిచయం ఉంది కాబట్టే పవన్ ను కలిసినట్లు కథలు చెబుతున్నారు. ఒక పార్టీలో ఉంటు మరోపార్టీ అధినేతను కలిశారంటే పార్టీ మార్పిడి కోసమనే అనుకుంటారు ఎవరైనా.

 

రాధాతో సమస్య ఏమిటంటే తనను తాను చాలా పెద్ద నాయకుడిగా ఊహించుకుంటుంటారు. మూడుసార్లు పోటీ చేసి ఒకసారి మాత్రమే గెలిచారంటేనే నియోజకవర్గంలో రాధాకున్న పట్టేంటో తెలిసిపోతోంది. గెలిచిన ఒక్కసారి కూడా ప్రత్యర్ధి బిజెపి అభ్యర్ధి అవటం వల్లే గెలిచారు. మొత్తం మీద రాధా రాజకీయ జీవితం చరమాంకానికి వచ్చేసినట్లే అని అర్ధమైపోతోంది. తను చేసిన తప్పులే రాజకీయంగా దెబ్బ తీసినట్లు రాధాకు ఎప్పుడు అర్ధమవుతుందో ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: