చంద్రబాబుకు ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎపుడూ అనుకోలేదేమో. తెలుగుదేశానికి అధికారం శాశ్వతం, టీడీపీ ఎప్పటికీ శాశ్వతం ఇలాగే సాగాయి ఆయన ఆలోచనలు. విజన్  2029, 2050 ఇలా తాను, కొడుకు, మనవడు ఏపీని ఏలేద్దామనుకుని భారీ ప్రణాళికలు రూపొందించుకున్నారు.


ఇపుడు జగన్ బంపర్ మెజారిటీతో ఏపీలో అధికారంలోకి వచ్చాడు. ఆయన నెల తిరక్కుండానే చుక్కలు చూపిస్తున్నాడు. పైగా ప్రజావేదిక బాబు దగ్గరుండి నిర్మించిన భవనం, పేరుకు అది ప్రభుత్వ  భవనం అయినా అందులో తెలుగుదేశం మీటింగులే ఎక్కువగా జరిగాయి. బాబు గారి మధుర జ్ణాపకాలు అన్నీ అందులోనే పదిలంగా ఉన్నాయి. దాన్ని కూల్చేయడం అంటే బాబు తీపి గురుతులను చిదిమేయడమే.


నిజంగా ఇది తట్టుకోలేని విషయమే. పక్కనే చంద్రబాబు నివాశం. ఇపుడు కూల్చివేతను అలా చూస్తూ బాబు గారు ఎంతటి మానసిక వేదనకు గురి అవుతున్నారో, పక్కన ఇది తప్పు అని చెప్పేందుకు కూడా ఒక్కరు కూడా సాహసించలేరు. బీజేపీ అయినా, వామపక్షాలు అయినా అఖరుకు పవన్ కళ్యాణ్ అయినా అక్రమ కట్టడం కూల్చాల్సిందే అంటున్నారు. మొత్తానికి చంద్రబాబుకు ఇంతకంటే నిస్సహాయ స్థితి వేరే ఉండదేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: