టీడీపీ మాజీ మంత్రి నెల్లూరు నారాయణ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. టీడీపీ పార్టీలో కీలక నేతగా చలామణి అయ్యారు. ఎన్నికలకు ముందు నెల్లూరు జిల్లాలో అంతా తానే అన్నట్లు వ్యవహరించారు మాజీమంత్రి నారాయణ. ఫలితాలొచ్చిన తర్వాత అసలు కంటికి కనిపించకుండా మాయమైపోయారు. తాజాగా జరిగిన నెల్లూరుజిల్లా పార్టీ సమావేశానికి ఓడిపోయిన నేతలంతా వచ్చారు ఒక్క నారాయణ తప్ప. అక్కడే నారాయణ గురించి చర్చ మొదలైంది.


ఎవ్వరికీ ఫోన్లో కూడా అందుబాటులో లేకుండా ఆయన ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారనే విషయంపై హాట్ డిస్కషన్ జరిగింది. చివరిగా చంద్రాబాబుకి కూడా నారాయణ అందుబాటులో లేరని నిర్థారించుకుని, అధికారంలో ఉన్నన్నాళ్లు మాపై పెత్తనం చలాయించి, ఇప్పుడు ఏమీ పట్టనట్టు మాయమైపోతారా అంటూ విమర్శిస్తున్నారు జిల్లా నేతలు. ఓటమి తర్వాత మాజీమంత్రి నారాయణ పూర్తిగా టీడీపీ నేతల్ని దూరంపెట్టారు.


తన పక్కనే ఉంటూ తనకిందే గోతులు తీశారన్న అనుమానం ఓవైపు, మంత్రిగా ఉండి కూడా ఓడిపోయిన భారం మరోవైపు.. నారాయణకు దిక్కుతోచకుండా చేశాయి. దీంతో ఆయన దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకుంటారని అనుకున్నారంతా. అయితే పదవిలో ఉండగా చేసిన అక్రమాలు ఆయన్ని వదిలేలా లేవు. తన పేరు అడ్డం పెట్టుకుని చంద్రబాబు, లోకేష్ సాగించిన అవినీతి కూడా తనకే అంటుకుందని నారాయణకు అర్థమైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: