శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఖాళీగా ఉన్న 267 ఎకరాలకు సంబంధించిన భూమి వివరాలు స్పష్టంగా లేకపోవడంతో రెవెన్యూ , ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్ల మధ్య వివాధానికి తెరలేచింది.  ఆ ప్రాంతంలో కృషి విజ్ఞానకేంద్ర, పారిశ్రామికవాడ ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి  ప్రతిపాదనలను పంపింది. ఈ విషయం తెలిసి  అటవీశాఖ అధికారులు  జోక్యం చేసుకొని ఆ భూమి  తమదని పేర్కొన్నారు. అప్పటినుంచి రెవెన్యూ, ఆటవిశాఖల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. 


ఆ ఖాళీ భూమిలోని సుమారు 100 ఎకరాల్లో గిరిజనులు, ఇతరులు గత కొన్నేళ్లుగా జీడీ చెట్లు సాగు చేసుకుంటున్నారు. వాటి ద్వారా వచ్చే ఫలితాలను పొందుతున్నారు. 100 ఎకరాలకు పైబడిన విస్తీర్ణంలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు ప్రభత్వ యంత్రాంగ సన్నాహాలను చేస్తుంది. అయితే ఆ భూమి తమదంటూ గిరిజనులను అడ్డుకొనేందుకు అటవీశాఖ సిద్దపడుతోంది. ఈ వివాదాస్పద భూముల వ్యవహారంపై గతేడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇచ్చాపురం ఎమ్మెల్యే  బెందాళం అశోక్  ప్రశ్నించారు.

 దీనిపై సమగ్రంగా సర్వే చేస్తామని అప్పటి డిప్యూటీ సీఎం కె. ఈ. కృష్ణమూర్తి అసెంబ్లీలో హామీ ఇచ్చారు. అందులోభాగంగా అప్పటి టెక్కలి ఆర్డీవో వెంకటేశారరావు, సంయుక్త కలెక్టర్ చక్రధర్ బాబు పలుమార్లు పర్యటించి పరిశీలించారు. 2018 లో ఈ అంశం పై పలుమార్లు రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో కలెక్టర్ ధనంజయరెడ్డి సమావేశమయ్యారు. మిగిలిన భూములకు సంబందించిన అటవీశాఖ వద్ద ఎలాంటి ఆదారాలు లేవని రెవెన్యూశాఖ అదిరారులు అంటుండగా, ఆ భూమి తమదని ఆటవిశాఖ   అధికారులు పేర్కొంటున్నారు. ఇలా రూ. వందల కోట్లు విలువ చేసే వందల ఎకరాల భూమికి సంబంధించిన వివాదం గత ఏడాదిన్నరగా నడుస్తోంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: