జగన్ మరో సంచలనానికి నాంది పలకబోతున్నాడా .. రాజధాని మార్పు నిజమేనా.. ? అయితే దీనికి సమాధానం అవుననే చెప్పాలి. ఏపీ రాజధాని అమరావతి పేరు మార్చి 33 వేల ఎకరాలను కుదించాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. తక్కువ ప్రాంతంలో అవసరమైన భవనాలు మాత్రమే ఏర్పాటుచేసి పరిపాలనపై ప్రధాన దృష్టిపెట్టాలని జగన్ ఆలోచిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. తాజాగా దీనిపై ఓ హింట్ బయటకు వచ్చింది. 


ప్రభుత్వ వర్గాల నుంచి అనధికారికంగా వినిపిస్తున్న మరో విషయం ఏంటంటే... ఏపీ రాజధాని పేరు - ఏరియా మార్చాలని ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారట. అయితే ముందుగా ప్రచారం అయినట్టు దొనకొండకు కాకుండా అమరావతి ప్రాంతంలో కొంత భాగమైన త గుంటూరు జిల్లాలోని తుళ్లూరును జగన్ ప్రభుత్వం రాజధానిగా చేయవచ్చునని అంటున్నారు.అయితే ఇది అంత సులువైన పని కాదు.


రాజధాని మార్పు కేవలం రాష్ట్రం చేతుల్లో ఉండదు. అది ఒక పెద్ద ప్రక్రియ. కేంద్రం మాత్రమే పూర్తిచేయగలిగిన ప్రక్రియ. దానికి ప్రత్యేకంగా గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే ఒక రాజధానిని అంత సులువుగా మార్చడానికి కేంద్రం ఒప్పుకుంటుందా అన్నది అనుమానమే. కాకపోతే ఏపీ ముఖ్యమంత్రి అనుకూల ప్రభుత్వం కేంద్రంలో ఉండటం వల్ల సాధ్యం కావచ్చేమో చెప్పలేం.

మరింత సమాచారం తెలుసుకోండి: