- నరసన్న పేట గవర్మెంట్ ఆసుపత్రిలో పనితీరుపై  మంత్రి ఆగ్రహం
 
ఇద్దరు స్త్రీ  వైద్య నిపుణులు ఉన్నప్పటికీ ఇతరులతో ఆపరేషన్లు చేయిస్తున్నారని ప్రజలు  పిర్యాదు చేయటంతో మంత్రి ధర్మాన కృష్నదాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరసన్నపేటలో 50 పడకల ఆసుపత్రిని మంత్రి ధర్మాన బుధవారం తనిఖిలు చేసారు. ఈ సందర్బంగా  ఆసుపత్రి పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక్కడ చాలాకాలంగా పనిచేస్తున్న డాక్టర్లు తమ సొంత జాగీరుగా భావిస్తున్నారని ఆసుపత్రి నిధులను దుర్వియోగం చేస్తున్నారని మండిపడ్డారు.


 ప్రభుత్వ వేతనాలు పొందుతున్న వారిని పక్కన పెట్టడం దారుణమన్నారు. కొందరు  వైద్యులు రాజకీయాలు  నడుపుతూ తమ జాగీరులా వ్యవహారిస్తున్నారని ఇకపై పద్ధతులు మారాలని మంత్రి హెచ్చరించారు. ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా జిల్లాలో సేవలు అందాలని, ఒక్క రూపాయి కూడా వసూలు చెయ్యకూడదని సూచించారు.  బయోమెట్రిక్ సేవలను పరిశీలించడానికి వచ్చిన మంత్రి  కృష్ణదాస్ కు ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. 


అటెండెన్స్‌ రిజిస్ట్రేషన్‌ నిర్వహణ సక్రమంగాలేదని, ఇక్కడ పనిచేసేవారు కూడా సంతకాలు పెట్టడం లేదని, ఇదేమి పద్దతని ఆయన ప్రశ్నించారు. ఆసుపత్రి సూపరెండెంట్ సెలవులో వున్నారని చెప్పిన సిబ్బంది లీవ్‌  లెటర్ ను చూపించలేకపోయింది. అనంతరం మంత్రి వార్డుల్లో తిరిగి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుకున్నారు. ఎవరు డబ్బు చెల్లించ  వలసిన అవసరం లేదని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: