ఒకవైపు కరకట్టపై నిర్మించిన అక్రమ కట్టడాల్ని తొలగించాలని జగన్మోహన్ రెడ్డి గట్టి నిర్ణయంతో ఉండగా మరో వైపు ఆ నిర్ణయంపై పచ్చ పైత్యం విషం చిమ్ముతోంది. కరకట్టపై అక్రమ నిర్మాణాలు ఉండకూడదని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లాంటి అనేక సంస్ధలు ఎప్పటి నుండో మొత్తుకుంటున్నాయి. అందుకు అనుగుణంగానే జగన్ కూడా అక్రమ నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

 

ఇందులో భాగంగా చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడు నిర్మించిన ఓ అక్రమ కట్టడం ప్రజావేదికను కూల్చేయటంతో ఎల్లో మీడియా తట్టుకోలేకపోతోంది. జగన్ నిర్ణయాలపై విషం చిమ్మేట్లుగా కథనాలను వండి వార్చుతున్నాయి.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే విజయవాడలో ఆక్రమణలు ఉన్నాయని కాదు ప్రజావేదికను కూలగొట్టించారనే. జగన్ తదుపరి టార్గెట్ చంద్రబాబు నివాసముంటున్న మరో అక్రమ నిర్మాణం లింగమనేని గెస్ట్ హౌస్ మీదుందనే. మొత్తం మీద చంద్రబాబుకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారన్న ఏకైక కారణంగానే ఆక్రమణల తొలగింపు అన్న నిర్ణయంపై పచ్చ పైత్యం బయటపడుతోంది.

 

విజయవాడలోనే కాదు యావత్ రాష్ట్రం మొత్తంలో ఎన్నో అక్రమ నిర్మాణాలుంటాయి. అవన్నీ ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినవి కావు. కానీ వాటికి కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్న, నిర్మించిన ప్రజావేదికకు చాలా వ్యత్యాసముంది.  అక్రమ నిర్మాణాలను ఎవరైనా నిర్మించుకోవచ్చు, అక్రమ నిర్మాణాల్లో ఉండొచ్చు. వాటిని తీసేయటం, వాళ్ళను ఖాళీ చేయించటం సులభం. కానీ స్వయంగా ముఖ్యమంత్రే అక్రమ నిర్మాణాల్లో ఉంటూ అక్రమ నిర్మాణాలు చేస్తే ఎలా ?

 

ఆ విషయాల్లోనే జగన్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. దాన్నే పచ్చ పైత్యం తట్టుకోలేకపోతోంది. ప్రజావేదికను కూల్చేయటంతో వేరే దారిలేక చంద్రబాబు కూడా తానుంటున్న అక్రమ నిర్మాణం నుండి బయటకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. దాన్నే ఎల్లో మీడియా తట్టుకోలేకపోతోంది. అందుకనే చరిత్రనంతా తవ్వి విషం చిమ్ముతోంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: