కరకట్ట మీద అక్రమంగా కట్టుకున్న గెస్ట్ హౌస్ ను చంద్రబాబునాయుడుకు  ఓనర్ లింగమనేని రమేష్ రాసిచ్చేశారా ? వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం మొదలైంది. నిజంగానే అక్రమ నిర్మాణంలో అద్దెకు ఉంటుంటే ఖాళీ చేయటానికి చంద్రబాబుకు వచ్చిన ఇబ్బందేమిటి ? అంటూ విజయసాయి ట్విట్టర్లో సూటిగా నిలదీశారు.

 

విజయసాయి లేవనెత్తిన ప్రశ్నే అందరిలోను మెదులుతోంది.  ఎవరైనా అద్దెకు ఉన్నపుడు ఓనర్ ఖాళీ చేయమన్నా లేకపోతే ఏదైనా కారణాలతో ఖాళీ చేయాల్సొస్తే వెంటనే ఖాళీ చేసేస్తాం. అంతేకానీ అద్దె ఇంటినే పట్టుకుని వేళాడం కదా ? మరి ఇపుడు చంద్రబాబు మాత్రం ఎందుకింతగా అక్రమ నిర్మాణం అని తెలిసినా అందులో నుండి వెళ్ళటానికి ఇష్టపడటం లేదు ?

 

చంద్రబాబు అక్రమ నిర్మాణంలో ఉంటే దానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అద్దె మాత్రం ఎలా చెల్లిస్తుంది ?  అక్రమనిర్మాణానికి ప్రభుత్వం అద్దె చెల్లిస్తుంటే అది అక్రమనిర్మాణమని ప్రభుత్వం ఎలా చెబుతుంది ? కాబట్టి ఆ ఇంటికి చెల్లిస్తున్న అద్దెను ప్రభుత్వం వెంటనే నిలిపేయాల్సిందే.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: