ఉన్నత విద్య సమీక్షా సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ యూనివర్శిటీల వీసీల ఎంపికకు తక్షణమే సెర్చ్‌కమిటీలు  30 రోజుల్లోగా వీసీలను ఎంపిక చేయాలి. యూనివర్శిటీల్లోని అన్ని ఖాళీలను ఈ ఏడాది చివరినాటికి భర్తీ  పారదర్శక విధానంలో వీసీల ఎంపిక చేయాలి. అత్యంత అర్హత, అనుభవం ఉన్న వారికి వీసీలను ఎంపిక చేయాలి. ప్రభుత్వ యూనివర్శిటీలను బలోపేతం చేయాలి. మౌళిక సదుపాయాలను బలోపేతం చేయడానికి గట్టిగా చర్యలు తీసుకోవాలి. ఫీజు రియింబర్స్‌మెంట్‌ వాస్తవిక దృక్పథంతో అమలు చేయాలి లేకపోతే మధ్యతరగతి, పేదపిల్లలు చదువుకోలేరు నాకళ్లతో నేను చూశాను చదువుకోలేక పిల్లలు, చదువు ఇవ్వలేక తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి.


మన భవిష్యత్‌తరాలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే వాళ్లకాళ్లమీద వాళ్లు నిలబడేలా తీర్చిదిద్దడమే మనం వారికి ఇచ్చే అందుకే నాణ్యమైన విధ్య ఉండాలి, ఆ నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండాలి పీజు రియింబర్స్‌మెంట్‌లో ఫీజులు సమయానికి ఇవ్వడంలేదు.


ఇక కాలేజీలు ఎలా బతుకుతాయి ప్రతి మూడునెలలకో సారి ఇచ్చే పరిస్థితి చూడండి... వారికి తోడ్పాడును ఇచ్చేలా ఫీజులను చెల్లించాలి ఏడాది తర్వాత, రెండేళ్ల తర్వాత ఇచ్చే పరిస్థితి కూడదు. పాఠ్యప్రణాళికను ఇంప్రూవ్‌ చేయడానికి ఒక కమిటీని వేయాలి వచ్చే విద్యాసంవత్సరం నుంచి మార్పుచేసిన సిలబస్‌ అమల్లోకి రావాలి టైం బౌండ్‌ షెడ్యూల్‌ దీనికి ప్రకటించాలి. సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్శిటీని అరుకులో ఏర్పాటు చేయాలని ఆదేశం అలాగే గిరిజన మెడికల్‌ కాలేజీని అరుకులో ఏర్పాటుæ చేయాలని ఆదేశం .


ఒంగోలు, విజయనగరంల్లో యూనివర్శిటీలు పెడతామంటూ  ఎన్నికలకు ముందు హడావిడిగా జీవోలు ఇచ్చారన్న అధికారులు ఈ రెండు యూనివర్శిటీలను మూడేళ్లలో పూర్తిచేయాలన్న సీఎం  శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో పనులు పూర్తికి, ఒంగోలులో ట్రిపుల్‌ఐటీ ఏర్పాటుకు సీఎం ఆదేశం ఈ సాయంత్రానికి యూనివర్శిటీ సెర్చ్‌ కమిటీల ఏర్పాటు నెలరోజుల్లోగా యూనివర్శిటీలకు వీసీల నియామకం పూర్తిచేయాలి యూనివర్శిటీల్లో పోస్టుల భర్తీని పారదర్శకంగా చేయమని ఆదేశం ఏడాదిలోగా యూనివర్శిటీల్లో పోస్టులను భర్తీచేయాలని ఆదేశం ట్రిపుల్‌ ఐటీల్లో పరిస్థితులు అన్యాయంగా ఉన్నాయన్న సీఎం ట్రిపుల్‌ ఐటీల్లో 50శాతం మంది విద్యార్థులకు మాత్రమే ప్లేస్‌మెంట్‌ వస్తుందన్న అధికారులు.


ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్న సీఎం ట్రిపుల్‌ ఐటీల్లో పూర్తిస్థాయిలో పరిస్థితులు మారాలన్న సీఎం ట్రిపుల్‌ ఐటీ నిధులను ఎన్నికల స్కీంలకు గత ప్రభుత్వం మళ్లింపు ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం ఉంటుంది, వేగవంతంగా మార్పులు రావాలని సీఎం ఆదేశం ట్రిపుల్‌ ఐటీలకు తాగునీరు కొరత రాకుండా చూడాలని సీఎం ఆదేశం రిజర్వాయర్లనుంచి నేరుగా పైపులైన్‌ ఇవ్వాలన్న సీఎం. ట్రిపుల్‌ ఐటీల్లో ఆత్మహత్య ఘటనలపై సీఎం ఆందోళన కచ్చితంగా వాతావరణం మారాలన్న సీఎం ఆయా క్యాంపస్‌లను సందర్శించాలని విద్యాశాఖమంత్రి, అధికారులకు  ఆదేశం.


మరింత సమాచారం తెలుసుకోండి: