జగన్మోహన్ రెడ్డికి తెలంగాణా సిఎం కెసియార్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకపుడు ఇద్దరు శతృవుల్లాగా ఉన్నా కొంతకాలంగా ఇద్దరి మధ్య బాగా చెలిమి ముదిరిపోయింది. జగన్ కు కెసియార్ ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో చెప్పటానికి తాజాగా ఓ ఘటన జరిగింది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి కోసం తెలంగాణా సిఎం కెసియారే తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. విషయం ఏమిటంటే గురువారం సాయత్రం జగన్ హైదరాబాద్ చేరుకున్నారు. సుమారు 6.30 గంటల ప్రాంతంలో  తెలంగాణా భవన్ మీదుగా లోటస్ పాండ్ కు వెళ్ళాలి. జగన్ కాన్వాయ్ తెలంగాణా భవన్ దగ్గరకు వచ్చేసింది.

 

అయితే విషయం తెలీని కెసియార్ ప్రగతి భవన్ కు బయలుదేరారు. కెసియార్ బయలుదేరబోతున్న విషయాన్ని వ్యక్తిగత భద్రతా సిబ్బంది ట్రాఫిక్ పోలీసులకు చెప్పి అలర్ట్ చేశారు. అయితే జగన్ వస్తున్న విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు కెసియార్ భద్రతా సిబ్బందికి చేరవేశారు.

 

వెంటనే అదే విషయాన్ని భద్రతా సిబ్బంది కెసియార్ కు చెప్పారు. అప్పటికి జగన్ కాన్వాయ్ తెలంగాణ భవన్ దగ్గరకు చేరుకుంది. దాంతో కెసియార్ తన ప్రయాణాన్ని కొద్దిసేపు వాయిదా వేసుకున్నారు. జగన్ కాన్వాయ్ తెలంగాణా భవన్ దాటిపోయిందని ట్రాఫిక్ సిబ్బంది చెప్పిన తర్వాతే కెసియార్ తెలంగాణా భవన్ నుండి బయలుదేరారు.

 

మామూలుగా అయితే ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఎంతటి వివిఐపినైనా సరే ట్రాఫిక్ పోలీసులు ఆపేస్తారు. నిజానికి హైదరాబాద్ ఉమ్మడి రాజధానే అయినా అదంతా చరిత్రగా మిగిలిపోయింది. అందులోను హైదరాబాద్ తెలంగాణా భూభాగంలో ఉంది కాబట్టి టాప్ ప్రయారిటి కెసియార్ దే అనటంలో సందేహం లేదు. అలాంటిది కెసియారే కాసేపు జగన్ కోసం తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారంటే...

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: