తెలుగుతమ్ముళ్లు మరోసారి హైరానా పడుతున్నారు. స్థానికి సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించాలని యోచిస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్ల కోసం ఎక్కడికక్కడ సన్నద్దమవుతున్నారు. అయితే ప్రత్యేక హోదా సాధనలో ఘోరవైఫల్యం చెందిన తెలుగు దేశం పార్టీని విశ్వసించే స్థితిలో ప్రజలు లేరనే విషయాన్ని తెలుగు తమ్ముళ్లు గమనించలేకపోతున్నారు. అయినప్పటికీ వారి ప్రయత్నాల్లో లోపంలేకుండా కష్ణపడుతున్నారు. 


కాకినాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో  కాకినాడ రూరల్ నియోజక వర్గ సమావేశం నిర్వహించారు. కాకినాడ రూల్‌ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి పిల్లి సత్యనారాయణ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ళ లో ప్రజలకు దగ్గరగా ఉంటూ, నియోజక వర్గ అభివృద్ధితో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చేశామన్నారు. 


కాగా వచ్చే స్థానికి సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచిచూడాల్సిన అంశం. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులు గెలుస్తారని ఆశించిన స్థానాల్లో ఓటమిని చవిచూడటాన్ని ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: