తాను చనిపోయిన తరువాత తన  ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలని, తండ్రి వైఎస్ లా  తనను అంతా గుర్తు పెట్టుకోవాలని జగన్ తపన పడుతున్నారు. ఏదీ దాచుకోకుండా జగన్ చెప్పేస్తున్నారు కూడా. ప్రమాణ స్వీకారం చేసినపుడు కూడా ఆయన చేసిన తొలి సంతకం పేదల కోసేమే. తన లక్ష్యాలు ఏంటన్నది కచ్చితంగా జగన్ నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నారు.


మరి టీడీపీ అనుకూల మీడియాకు మాత్రం జగన్ సీఎం అయింది చంద్రబాబుని జైలుకు పంపించడానికేననిపిస్తోందట. జగన్ నెలరోజుల పాలన మీద అనుకూల మీద కొత్త పలుకులు చిలక‌పలుకుల్లా ఉన్నాయంటున్నారు. బాబు మీద విచారణలు జరిపించి ఎలాగైనా చంచల్ గూడా  జైలుకి జగన్ పంపిస్తారని అనుకూల మీడియా తెగ కలవరపడుతోంది. జగన్ తాను పదహారు నెలలు జైల్లో ఉన్నట్లుగానే బాబును కూడా కక్షపూర్వకంగా ఉంచాలనుకుంటున్నారని కూడా రొచ్చు రాతలు మొదలెట్టేసింది.


జగన్ ఎన్ని విచారణలు జరిపించినా చంద్రబాబుకు సానుభూతి వస్తుంది తప్ప ఏం కాదని కూడా రాస్తోంది. ప్రజావేదికను కూల్చడం వెనక చంద్రబాబు మీద ప్రతీకారమే ఉందని పేర్కొంటోంది. జగన్ విలువైన  సమయాన్ని ఇలా వ్రుధా చేస్తున్నారుట. తాను ఇచ్చిన హామీలను మరచిపోయారట. ఇలాగైనే జగన్ భారీ మూల్యం చెల్లించుకుంటారట. అంటే వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారని, ఓడిపోవాలని కోరుకుంటోందన్న మాట.


అనుకూల మీడియా. మొత్తానికి  జగన్ మీద ఉన్న కక్షను మరో మారు అనుకూల మీడియా ఇలా చిమ్ముతోంది. మరీ నెల రోజులకే అద్భుతాలు ఎవరూ చేయరు. జగన్ మాత్రం అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సంగతి అనుకూల మీడియాకు కనిపించకపోవడం విచిత్రమే.


మరింత సమాచారం తెలుసుకోండి: