ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి పార్టీకి ఆంధ్రాలో ఆశించిన స్థాయిలో కూడా స్థానాలు రాకపోవడంతో టిడిపి క్యాడర్ కొంత లోలోపల మధనపడుతున్నట్లు సమాచారం. నిజానికి గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారి పాలనలో ఎటువంటి లోపం లేదని, అయితే ఒక్క ప్రత్యేక హోదా విషయమై రాష్ట్రానికి చంద్రబాబు మేలు చేయాలని తలచినప్పటికీ అప్పటి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వారు మాత్రం తమకు సహకరించలేదని, అయితే అది 2019 ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపదని టిడిపి క్యాడర్ భావించిందట. 

ఇక ఆ నమ్మకంతో ఎన్నికలబరిలో నిలిచిన టీడీపీకి ప్రజలు ఊహించనివిధంగా మరీ అత్యల్ప స్థానాలు మాత్రమే కట్టబెట్టారు. అయితే గెలుపోటములు ఎక్కడైనా ఎంతటివారికైనా సహజం అని, అయినా ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీకి ఈ ఓటమితో పెద్దగా వచ్చే నష్టం ఏమిలేదని టిడిపిలోని కొందరు నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే టీడీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడం, అంతేకాక కొందరు టీడీపీ ఎమ్యెల్యేలు వైసిపి నాయకులతో ఇప్పటికీ టచ్ లో ఉన్నట్లు కొద్దిరోజలుగా వార్తలు వస్తుండడం ఆ పార్టీకి కొంత తలనొప్పిగా మారింది. అయితే పార్టీలో గతకొద్దిరోజలుగా జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న హిందూపురం ఎమ్యెల్యే బాలకృష్ణ, చంద్రబాబు గారిపై కొంత అలకబూనినట్లు రెండు రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. 

అయితే అది తాత్కాలికమని, ఎంతటి పార్టీకైనా కొద్దిపాటి సమస్యలు రావడం సహజమని, మరికొద్దిరోజుల్లో బావ, బావమరుదులు ఇద్దరూ మళ్ళి మాములుగా కలిసిపోతారని కొందరు రాజకీయ విశ్లేషకులు ఆ వార్తలపై స్పందిస్తూ మాట్లాడినట్లు సమాచారం. నిజానికి పార్టీలో జరుగుతున్న కార్యకలాపాలపై బాలకృష్ణ కొంత అనాసక్తితో ఉన్నారు అని ప్రచారం అవుతున్న ఆ వార్తలను పూర్తిగా కొట్టిపారేస్తూ, నేటి ఉదయం చంద్రబాబు కుటుంబ సభ్యులు మరియు బాలయ్య కలిసి విజయ నిర్మల గారి మరణం పట్ల కృష్ణ గారిని కలిసి పరామర్శించేందుకు వెళ్లడం జరిగింది. ఇక వారిద్దరి ఈ మీటింగ్ తో ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్తలు అన్నీ ఒట్టి పుకార్లే అని తేలిపోయింది...!!  


మరింత సమాచారం తెలుసుకోండి: