ఇచ్చిన మాట నెరవేర్చే వ్యక్తిగా , ప్రజల ఆశలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్ నెల రోజుల పాలన సాగిందని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. అమ్మవడి, రైతు భరోసా, పెన్షన్స్ పెంపు, అంగన్ వాడి, ఆశా వర్కర్స్ వేతనాలు  ఇలా అనేక గొప్ప నిర్ణయాలు నెల రోజుల్లోనే ముఖ్యమంత్రి  తీసుకున్నారని గుర్తుచేశారు. గత ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేశారని, మా  ముఖ్యమంత్రి ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారని కొనియాడారు.


ప్రజా ప్రతినిధులు పాలకులు కాదు..సేవకులమని చెప్పిన నాయకుడు జగన్ అని ప్రసంశించారు. అవినీతి పై ఉక్కుపాదం మోపుతున్నారని,  రాష్ట్ర ప్రజలు ఆలోచనలకు ,ఆశలకు అనుగుణంగా  ముఖ్యమంత్రి పాలన సాగుతోందన్నారు. రాజకీయా ఒత్తిళ్లలకు లొంగకుండా పాలన చేయమని అధికారులుకు చెప్పిన ముఖ్యమంత్రి  జగన్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కట్టిన అక్రమ కట్టడాలను కూల్చి అక్రమ కట్టడాల పై ప్రభుత్వ విధానం ఎలా ఉంటుందో చాటిచెప్పిన సాహశీలి ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు.


రాష్ట్ర ప్రజలకు వచ్చే 5 ఏళ్లలో ఇచ్చిన ప్రతి హామీని నెలబెట్టుకుంటామని భరోసా ఇచ్చారు. రవాణా శాఖ లో సిబ్బంది కొరత ఉందని, అధికారులకళ్లుగప్పి  హెవీ లోడ్ తో వాహనాలు వెళ్ళటం వలన ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వీటిని నియంత్రించేందుకు అవసరమైన చర్యలకు ముఖ్యమంత్రి జగన్‌ అధికారులతో సమీక్షించనున్నారని వెల్లడించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: